దూకేస్తా: ప్రత్యేక హోదా కోసం సెల్ టవర్ ఎక్కిన విజయ్ భాస్కర్

అనంతరపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్‌ చేస్తూ నవ్యాంధ్ర డెవలప్‌మెంట్‌ ఫోరం అధ్యక్షుడు పెనుబోలు విజయ్‌ భాస్కర్‌ శనివారం సెల్‌ టవర్‌ ఎక్కారు. ధర్మవరంలో శనివారం సెల్‌ టవర్‌ ఎక్కిన విజయ్‌ భాస్కర్‌ ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు.

హోదా కోసం చనిపోతానంటూ లేఖ కూడా రాశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని అతన్ని కిందకు దించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Man Climbs Cell Tower, Demands AP Special Status In Anantapur

కాగా, మంత్రులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ ప్రత్యేక హోదాపై హామీ ఇస్తే కిందికి దిగుతానని భాస్కర్ చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఇటీవల వరంగల్‌కు చెందిన ఓ వ్యక్తి దేశరాజధానిలో సెల్‌ టవర్‌ ఎక్కిన విషయం తెలిసిందే. చిత్తూరులో ప్రత్యేక హోదా డిమాండ్‌ చేస్తూ ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+