పదేళ్ల బాలికతో కలిసి వ్యక్తి ఆత్మహత్య: తండ్రీకూతుళ్లా?
ఏం కష్టం వచ్చిందో,ఎక్కడి నుండి వచ్చారో తెలియదు. నది ఒడ్డున విగత జీవులై పడి ఉన్నారు. మృత దేహాలను చూసిన వారు అయ్యో పాపం అనడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు.
గుంటూరు: ఏం కష్టం వచ్చిందో,ఎక్కడి నుండి వచ్చారో తెలియదు. నది ఒడ్డున విగత జీవులై పడి ఉన్నారు. మృత దేహాలను చూసిన వారు అయ్యో పాపం అనడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు.
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల గ్రామంలో క్రిష్ణానది ఒడ్డున గుర్తుతెలియని వ్యక్తి ఓ పదేళ్ళ బాలిక పురుగు మందుతాగి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సుమారు 35 సంవత్సరాలు పై బడిన ఆ వ్యక్తి ఒంటి పై తెల్ల గీతలు కలిగిన చొక్కా, బ్లూ కలర్ లుంగీ ధరించి ఉన్నాడు.

తన తో పాటు ఉన్న పాప మాత్రం స్కూల్ యూనిఫారం లో ఉంది. బహుశా తండ్రి కూతురు అయి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. చుట్టుప్రక్కల ప్రాంతం వారు కాదు అని, ఎక్కడ నుండి వచ్చారో తెలియదని స్థానికులు అంటున్నారు. విషయాన్ని గ్రామంలో వీఆర్వో కి ఆందించగా వీఆర్వో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications