ప్రేయసిని చంపి వ్యక్తి ఆత్మహత్య: లాడ్జిలో ఘోరం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవులో దారుణ సంఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా వాడరేవులోని ఓ పాడుబడిన ఇంట్లో మహిళను ప్రియుడు గొంతు కోసి చంపి, ఆ తర్వాత తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులను ఈతముక్కల విల్సన్,ఎరిపిల్ల జగమణిగా గుర్తించారు.
లాడ్జీలో యువకుడి ఆత్మహత్య
ఇదిలావుంటే, కడప జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కడప జిల్లా యర్రగుంట్లలోని ఓ లాడ్జిలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నడాు. రాజంపేటకు చెందిన సంజీవ్ కుమార్ అనే యువకుడు లాడ్జిలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

మహిళ ఆత్మహత్యాయత్నం
కాగా, నెల్లూరు పిఎస్ పేటలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా కొండమ్మ అనే మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆత్మహత్యకు యత్నించిన భార్యను కాపాడబోయి భర్త గాయపడ్డాడు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది.
నకిలీనోట్ల ముఠా పట్టివేత
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నకిలీ నోట్ల కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. గొల్ల కృష్ణమూర్తి, ఆంజనేయులు, దివాకర్‌లను అరెస్ట్ చేసి, వారినుంచి 4.35 లక్షల రూపాయల నకిలీకరెన్సీ నోట్లు, రెండు సెల్‌ఫోన్‌లు, ఓ ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications