మేడపై కిచెన్: యువకుడి ప్రాణం తీసిన విద్యుత్ షాక్ (ఫోటోలు)

విశాఖపట్నం: ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్‌కు గురై ఓ యువకుడు దుర్మరణం పాలైన సంఘటన నగరంలోని అక్కయ్యపాలెంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు, ఫోర్త్‌టౌన్ పోలీసులు ప్రకారం పెద్దూరుకు చెందిన కిళాడి శ్రీను (28) సంగం ఆఫీసు కూడలిలో అక్కయ్యపాలెం రెస్టారెంట్ అండ్ బార్ ముందు తోపుడు బండిపై నాన్‌వెజ్ వంటకాలు అమ్ముతుంటాడు.

షాపు ముందు బండి ఉండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని, బార్ రెండో అంతస్తు మేడపై కిచెన్ ఏర్పాటు చేసుకోమని యజమాని చెప్పారు. గురువారం నుంచి మేడపై కిచెన్ స్టార్ట్ చేద్దామని బుధవారం ఉదయం బార్‌పై ఉన్న రెండో అంతస్తుపైకి వెళ్లాడు.

కిచెన్‌కు ముందున్న ప్లెక్సీని ఏర్పాటు చేద్దామని బయటకు తీశాడు. ఈ క్రమంలో రోడ్డుపై ఉన్న హెచ్‌టీ విద్యుత్ వైర్లకు తగులుకుని షాక్‌కు గురయ్యాడు. విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మరణించాడు. చేతులు, శరీరం అంతా కాలిపోయి మేడపై ఒక మూలకు కూలబడిపోయాడు.

ప్రమాదం జరిగిన విషయం తెలియడంతో పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. ఇతనికి ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదిరిలు ఉన్నారు. మృతుడు శ్రీనుకి ఇంకా వివాహం కాలేదు. స్థానికుల సమాచారంతో ఏఎస్ఐ యర్రయ్య సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మేడపై కిచెన్: యువకుడి ప్రాణం తీసిన విద్యుత్ షాక్

ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్‌కు గురై ఓ యువకుడు దుర్మరణం పాలైన సంఘటన నగరంలోని అక్కయ్యపాలెంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు, ఫోర్త్‌టౌన్ పోలీసులు ప్రకారం పెద్దూరుకు చెందిన కిళాడి శ్రీను (28) సంగం ఆఫీసు కూడలిలో అక్కయ్యపాలెం రెస్టారెంట్ అండ్ బార్ ముందు తోపుడు బండిపై నాన్‌వెజ్ వంటకాలు అమ్ముతుంటాడు.

 మేడపై కిచెన్: యువకుడి ప్రాణం తీసిన విద్యుత్ షాక్

మేడపై కిచెన్: యువకుడి ప్రాణం తీసిన విద్యుత్ షాక్

షాపు ముందు బండి ఉండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని, బార్ రెండో అంతస్తు మేడపై కిచెన్ ఏర్పాటు చేసుకోమని యజమాని చెప్పారు. గురువారం నుంచి మేడపై కిచెన్ స్టార్ట్ చేద్దామని బుధవారం ఉదయం బార్‌పై ఉన్న రెండో అంతస్తుపైకి వెళ్లాడు.

 మేడపై కిచెన్: యువకుడి ప్రాణం తీసిన విద్యుత్ షాక్

మేడపై కిచెన్: యువకుడి ప్రాణం తీసిన విద్యుత్ షాక్

కిచెన్‌కు ముందున్న ప్లెక్సీని ఏర్పాటు చేద్దామని బయటకు తీశాడు. ఈ క్రమంలో రోడ్డుపై ఉన్న హెచ్‌టీ విద్యుత్ వైర్లకు తగులుకుని షాక్‌కు గురయ్యాడు. విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మరణించాడు. చేతులు, శరీరం అంతా కాలిపోయి మేడపై ఒక మూలకు కూలబడిపోయాడు.

 మేడపై కిచెన్: యువకుడి ప్రాణం తీసిన విద్యుత్ షాక్

మేడపై కిచెన్: యువకుడి ప్రాణం తీసిన విద్యుత్ షాక్

ప్రమాదం జరిగిన విషయం తెలియడంతో పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. ఇతనికి ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదిరిలు ఉన్నారు. మృతుడు శ్రీనుకి ఇంకా వివాహం కాలేదు. స్థానికుల సమాచారంతో ఏఎస్ఐ యర్రయ్య సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+