భార్యాబిడ్డలున్నారు: ఫ్రెండ్‌తో పెళ్లంటూ ఆత్మహత్య

పోలీసుల కథనం ప్రకారం - చెన్న కేశవ్ అనే 32 ఏళ్ల వ్యక్తి చైతన్య జూనియర్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్ాడు. కొన్నేళ్ల క్రితం అతనికి వివాహమైంది. ఆమె బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత గుంటూరులోని పుట్టింటికి వెళ్లింది.
చెన్న కేశవ్ ఆ సమయంలో తనను పెళ్లి చేసుకోవాలని తన స్నేహితురాలిని అడిగాడు. వారిద్దరి మధ్య ఆరేళ్లుగా స్నేహం నడుస్తోంది. అవంతినగర్‌లోని తన నివాసానికి ఆ 23 ఏళ్ల స్నేహితురాలిని శుక్రవారంనాడు ఆహ్వానించాడు. ఆమె రాగానే పెళ్లి ప్రస్తావన చేశాడు. ఇప్పటికే అతనికి పెళ్లి కావడంతో అందుకు ఆమె నిరాకరించింది.
పెళ్లికి అంగీకరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అయినా ఆమె ముందుకు రాలేదు. వెంటనే అతను మరో గదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అరుపులు రావడంతో ఆమె గదిలోకి వెళ్లి ఇరుగుపొరుగువారి సహాయంతో తాడును కత్తితో కోసింది. అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications