షాక్ :కోడిపందేల్లో రివాల్వర్ తో కాల్పులు, ఎందుకంటే?
పశ్చిమగోదావరి జిల్లాల్లో కాల్పుల ఘటన కలకలం సృస్టించింది. కోడిపందెలు జరుగుతున్న చోట ఓ వ్యక్తి మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
తాడేపల్లిగూడెం :పశ్చిమగోదావరి జిల్లాల్లో కోడిపందేల సందర్భంగా చోటుచేసుకొన్న కాల్పల ఘటన కలకలాన్ని రేపింది. కోడిపందేలు జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి తన వద్ద ఉన్న రివాల్వర్ తో మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. కాల్పుల శబ్దానికి జనం అక్కడి నుండి పరుగెత్తారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
సంక్రాంతి పర్వదినం సందర్భంగా కోడిపందెలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో సంప్రదాయంగా ఈ పందెల్లో పెద్ద ఎత్తున పాల్గొంటుంటారు. అయితే పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం మండలం శ్రీనివాసపురం వద్ద శుక్రవారం నాడు కోడిపందెలు నిర్వహించారు.

కోడి పందెలు ప్రారంభమైన కొద్దిసేపటికే ఓ వ్యక్తి తన లైసెన్సుడ్ రివాల్వర్ తో గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కోడిపందెలు జరిగే చోటుకు వచ్చాడు. ఆయనను దయాకర్ గా గుర్తించారు. తన వద్ద ఉన్న లైసెన్స్ డ్ రివాల్వర్ తో ఆయన గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు.
అసలు ఏం జరుగుతోందో తెలియక కోడిపందెల కోసం వచ్చిన వారు భయంతో పరుగులు తీశారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొన్నారు.












Click it and Unblock the Notifications