ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్: ఢిల్లీలో సెల్ టవరెక్కిన తెలంగాణ యువకుడు
Recommended Video

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోదా కోరుతూ ఢిల్లీలో తెలంగాణకు చెందిన ఓ యువకుడు సెల్ టవరెక్కాడు. ఢిల్లీ మెట్రో భవన్ సమీపంలోని ఓ సెల్ టవర్‌పై ఎక్కిన యువకుడు.. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ బ్యానర్ చేతిలో పట్టుకుని నినాదాలు చేశాడు.
సమాచారం అందుకున్న పోలీసులు అతనికి కిందికి దించే ప్రయత్నం చేశారు. ఆ యువకుడిని వరంగల్‌కు చెందిన ఉమేష్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. ప్రధాన మంత్రి కార్యాలయ అధికారులు ఆ యువకుడితో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది.

క్రేన్ సహాయంలో పైకి ఎక్కి అతనితో మాట్లాడారు ఢిల్లీ పోలీసులు. ఆ తర్వాత తెలుగు తెలిసిన తెలుగు జర్నలిస్టులను పైకి తీసుకెళ్లికెళ్లి అతనితో మాట్లాడించారు. అయితే, హోదాపై ప్రకటన చేస్తేనే దిగుతానని, లేదంటే దూకేస్తానని బెదిరింపులకు గురిచేశాడు ఉమేష్.
పోలీసులు, జర్నలిస్టులు ఆ యువకుడితో గంటకుపైగా చర్చలు జరిపి అతడ్ని క్షేమంగా టవర్ పైనుంచి కిందికి దించారు. కాగా, అతడు కాంగ్రెస్ పార్టీ అభిమాని అని తెలిసింది. గత వారం రోజుల నుంచి అతడు ఏపీ భవన్‌లోనే ఉంటున్నట్లు సమాచారం. కాగా, సేవ్ ఆంధ్రప్రదేశ్, జై తెలంగాణ అనే నినాదాలు చేశాడు ఉమేష్.
Delhi: Man who climbed a tower near Metro Bhawan holding a banner reading 'AP (Andhra Pradesh) needs special status', has come down. pic.twitter.com/wyvp0r2tK0
— ANI (@ANI) July 27, 2018
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications