జనసేన సభలో అపశృతి...సౌండ్ సిస్టం తలపై పడటంతో వ్యక్తి మృతి
నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన జనసేన పార్టీ బహిరంగ సభలో అపశృతి చోటుచేసుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్న ఈ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా అక్కడి సభా ప్రాంగణం అభిమానులు, కార్యకర్తలతో కిక్కిరిసి పోయింది. అదే సమయంలో ఓ మైక్ సౌండ్ సెట్ తలమీద పడటంతో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ వ్యక్తిని హాస్పిటల్‌కు తరలించారు. హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే బాధితుడు మృతి చెందాడు.

మృతి చెందిన వ్యక్తిని సిరాజ్‌గా గుర్తించారు. సిరాజ్ మృతి చెందడంతో కొద్ది సేపు ప్రాంగణంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. మృతి చెందిన సిరాజ్ ఆటోడ్రైవర్ అని పోలీసులు తెలిపారు. అతను నడిగడ్డ ప్రాంతానికి చెందిన వాడు అని వెల్లడించారు. అతనికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉన్నట్లు తెలుస్తోంది. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించే సిరాజ్ మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇదిలా ఉంటే ఆయా పార్టీల బహిరంగ సభలుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు వస్తుండటంతో సభాప్రాంగణాలు కిక్కిరిసిపోతున్నాయి. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మరోవైపు బహిరంగ సభలు ఏర్పాటు చేసే ప్రాంతంలో నిర్వాహకులు కూడా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications