పొట్టిగా ఉన్నాడని.. బావని కిరాతకంగా చంపిన బావమరిది..!

ప్రస్తుతం సమాజంలో మానవ సంబంధాలు మంట గలిసిపోతున్నాయి. ఈ మాయ రోగం వచ్చిందో తెలియదు కానీ.. పెళ్లి అంటేనే భయపడేలా పలు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు పెళ్లి తర్వాత వివాహేతర సంబంధాల నేపధ్యంలో హత్యలు జరుగుతుంటే.. ఇప్పుడు కొత్తగా జరిగిన ఓ హృదయ విదారక ఘటన సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఇన్నాళ్లు కులాంతర, మతాంతర వివాహం చేసుకున్నారని హత్యలు జరగడం చూసుంటాం. అలానే తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారని.. పెద్దలు ఆగ్రహించి హత్యలకు పాల్పడ్డ ఘటనలు చాలానే ఉన్నాయి.

కానీ ఇప్పుడు అదే తరహాలోనే కానీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే షాకింగ్ ఘటన ఏపీలో సంచలనంగా మారింది. బావ పొట్టిగా ఉన్నాడని ఓ బావమరిది కిరాతకంగా అతడిని హత్య చేశాడు. పెళ్లి జరిగిన కొద్ది రోజులకే.. పక్కా ప్రణాళికతో స్నేహితుల సహాయంతో కత్తులతో పొడిచి నడిరోడ్డుపైనే హతమార్చాడు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.

man-killed-sister-husband-due-to-short-height-at-guntur

ఏం జరిగిందంటే..

బాపట్ల జిల్లా ఏడవురు గ్రామానికి చెందిన కుర్రా నాగ గణేష్ (25).. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సంగంజాగర్లమూడిలో కుటుంబంతో నివాసముంటున్నాడు. అతనికి గుంటూరు పవర్ ఆఫీసు సమీపంలోని బుడంపాడులో ఉద్యోగం రావడంతో గత మూడు నెలలుగా అక్కడే ఉంటున్నాడు. అయితే దూరపు బంధువైన తెనాలికి చెందిన కీర్తి అంజనీ దేవి ఇంటికి ఇటీవలే పెళ్లి చూపులకు వెళ్లాడు. ఆ క్రమంలోనే ఒకరినొకరు ఇష్టపడగా.. గణేష్ పొట్టిగా ఉన్నాడనే కారణంతో అంజనీ దేవి కుటుంబం సంబంధానికి ఒప్పుకోలేదు. కానీ అప్పటికే వారు ఫోన్ నెంబర్స్ మార్చుకొని మాట్లాడుకుంటూ ప్రేమలో పడ్డారు.

అయితే వారి ప్రేమకు కుటుంబాల అంగీకారం లేకపోవడంతో.. సెప్టెంబర్ 25న ఇంట్లో చెప్పకుండా పారిపోయి వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం బుడంపాడులో వారు కలిసి ఉంటుండగా.. అమ్మాయి కుటుంబం వారి నుంచి ప్రాణ హాని ఉందని.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇరువురి కుటుంబాలను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే రిసెప్షన్ కోసం గణేష్ తన స్నేహితుడు కరుణతో కలిసి గుంటూరులో బంగారం తాకట్టు పెట్టి డబ్బు తీసుకొని తిరుగు ప్రయాణం అయ్యారు.

అప్పుడే పక్కా ప్లాన్ తో బుడంపాడు రోడ్డుపై దుర్గారావు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి అతనిపై దాడి చేశాడు. మొదట రాయితో కొట్టి, అనంతరం కత్తులతో విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్రంగా గాయపడ్డ గణేష్‌ను కరుణ గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లినా అప్పటికే మృతి చెందాడు. పోలీసులు దుర్గారావు, అతని సహచరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గణేష్ పొట్టిగా ఉన్నాడు.. మాయమాటలతో చెల్లిని నమ్మించి పెళ్లి చేసుకున్నాడు.. అందుకే చంపానని ఒప్పుకున్నట్టు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+