భార్యపై అనుమానంతో నేలకేసి కొట్టి కూతురి హత్య
నెల్లూరు/ మచిలీపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా వెంకటగిరిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కన్నతండ్రే తన రెండు నెలల చిన్నారిని గొంతునులిమి చంపాడు. భార్యపై అనుమానంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు సమాచారం. నిందితుడు పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మణికంఠ, చంద్రకళలకు ఏడాదిన్నర క్రితం వివాహమైంది. భార్యపై అనుమానం పెంచుకున్న మణికంఠ మద్యం మత్తులో చిన్నారిని నేలకేసి కొట్టాడు. దీంతో చిన్నారి అక్కడికక్కడే మరణించింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

హెడ్మాస్టర్ ఆత్మహత్య
కృష్ణా జిల్లా అవనిగడ్డ డిగ్రీ కాలేజీలో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని శనివారం కళాశాల సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన డిగ్రీ కాలేజీకి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మచిలీపట్నంలోని జిల్లా వైద్య ఆస్పత్రికి తరలించారు. మృతుడు నాగాయలంక మండలం ఎదురుమొండి ఉన్నత పాఠశాల ప్రాధానోపాధ్యాయుడని పోలీసులు గుర్తించారు. హెడ్ మాస్టర్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications