కన్నతల్లిని చంపిన కొడుకు, భార్య సహకారం: విశాఖలో చిన్నారి మిస్సింగ్

గుంటూరు/విశాఖ: గుంటూరు జిల్లాలోని వినుకొండలోని సీతారామ టవర్స్‌లో కన్నతల్లినే ఓ కొడుకు దారుణంగా హత్య చేశాడు. ఈ హత్యకు అతడి భార్య కూడా సహకరించింది. హత్యను కొడుకు, కోడలే చేశారని మృతి చెందిన మహిళ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మృతి చెందిన మహిళ పైరు సత్యశ్రీ. ఆమె కొడుకు సందీప్. కోడలు శ్రావణి. వృద్దాప్యంలో ఉన్న తల్లిని చూడడం భారంగా భావించి వారు హత్యకు పాల్పడ్డారు. దానిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. బంధువులు ఇది హత్య అని ఫిర్యాదు చేశారు.

Murder

పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించారు. సత్యశ్రీని హత్య చేసింది కొడుకు సందీప్, కోడలు శ్రావణియే అని పోలీసులు నిర్ధారించారు. కుటుంబ కలహాలు హత్యకు దారి తీశాయని తెలుస్తోంది.

విశాఖలో 11 నెలల బాలుడు అదృశ్యం

విశాఖ జిల్లాలోని పదకొండు నెలల బాలుడు నవదీప్ అదృశ్యమయ్యాడు. ఆ చిన్నారి ఆరు బయట ఆడుకుంటుండగా మిస్ అయ్యాడు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నారి అదృశ్యం స్థానికంగా కలకలం సృష్టించింది.

తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షం

తూర్పు గోదావరి జిల్లా రంగంపేట, రాజానగరం మండలాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల చెట్లు కూలి ట్రాఫిక్ జాం అయింది. రాజమహేంద్రవరంలో ఒక్కసారిగా ఈదురుగాలులు వీచాయి. భారీ వర్షం కురిసింది. సాయంత్రం వరకు జిల్లాలో ఉన్న ఎండలు కాశాయి. సాయంత్రం ఒక్కసారిగా కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+