మహిళ ఆత్మహత్య: బావమరిది చేతిలో బావ హతం

మెదక్ జిల్లాలో భారీ చోరీ
మెదక్ జిల్లాలోని జహీరాబాద్‌లో దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. రఫీ జ్యువెలరీ షాపులో అరకిలో బంగారం, 30 కిలోల వెండిని దుండగులు అపహరించారు. వాటి విలువ 20 లక్షల రూపాయల మేరకు ఉంటుందని అంచనా షాపు వద్ద ఉన్న వాచ్‌మెన్‌పై దాడి చేసి దుండగులు ఈ చోరీకి పాల్పడ్డారు. షాపు యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
గంజాయి తోటలపై దాడి
ఇదిలావుండగా, మెదక్ జిల్లాలోని మనూర్ మండలం మావినెల్లి కిషన్‌నాయక్‌తండాలో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయితోటలపై పోలీసులు దాడి చేశారు. రెండు ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయిని ధ్వంసం చేశారు.
ట్రాక్టర్ ఢీకొన్ని బాలుడి మృతి
కరీంనగర్ జిల్లా కోరుట్లలో మున్సిపల్ వాటర్ ట్యాంకర్ ఢీకొని విద్యార్థి మరణించాడు. మృతుడిని కాల్వగడ్డ ప్రాంతానికి చెందిన ఎలిగేటి హరీష్ (12)గా గుర్తించారు. పాఠశాలకు వెళ్తుండగా అతను మృత్యువాత పడ్డాడు.












Click it and Unblock the Notifications