అక్రమ సంబంధం: భార్య ప్రియుడిని చంపిన వ్యక్తి

గోపాలపురం మండలం చిట్యాల గ్రామానికి చెందిన జ్యోతి నే మహిళకు కొయ్యలగూడెం మండలం గంగవరం గ్రామానికి చెందిన కలిదిండి పాటియ్యతో 13 ఏళ్ల క్రితం పెళ్లయింది. పాటియ్య ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.
అదే గ్రామానికి చెందిన పాటియ్య స్నేహితుడు, ఆటో డ్రైవర్ ఈడుగుబంటి శ్రీను (31) మూడేళ్లుగా జ్యోతితో అక్రమ సంబంధం సాగిస్తున్నాడు. ఆరు నెలల క్రితం పాటియ్యకు అనుమానం వచ్చింది. దాంతో భార్య జ్యోతిని కొట్టి పుట్టింటికి పంపించేశాడు. అయితే, 20 రోజుల క్రితం పాటియ్య భార్య వద్దకు వచ్చి అక్కడే ఉంటున్నాడు.
శనివారం రాత్రి 11 గంటల సమయంలో భర్త నిద్రిస్తుండగా బయటకు వచ్చిన జ్యోతి ప్రియుడు శ్రీనుతో కలిసి ఆటోలో బయటకు వెళ్లింది. దాన్ని గమనించిన పాటియ్య ఊరి బయటకు వచ్చి వారిద్దరినీ చూశాడు. దాంతో తనతో తీసుకు వచ్చిన ఇనుప రాడ్‌తో శ్రీను తలపై పాటియ్య విచక్షణారహితంగా కొట్టాడు.
దాంతో అక్కడి నుంచి జ్యోతి పారిపోయింది. కొనఊపిరితో ఉన్న శ్రీనును ఆటోలో వేసుకుని ప్రభుత్వాస్పత్రికి తీసుకుని వచ్చాడు. అయితే అప్పటికే శ్రీను మరణించాడు. దాంతో పాటియ్య పక్కనే ఉన్న పోలీసు స్టేషనులో లొంగిపోయాడు. మృతుడు శ్రీనుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిందితుడు పాటియ్యకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.












Click it and Unblock the Notifications