భార్యను, కొడుకుని చంపి కిరోసిన్‌తో తగులబెట్టాడు

స్థానికంగా ఉన్న ప్లాస్టిక్ కంపెనీలో కమీందర్ గత మూడు నెలల నుండి పనిచేస్తున్నాడు. కాగా, ఆదివారం ఉదయం ఏడు గంటల సమయంలో కమీందర్ ఉంటున్న గది నుండి కాలిపోయిన శవాల వాసన రావడంతో స్థానికులు కమీందర్ ఇంటికి వచ్చి ఏమి జరిగిందని ఆరా తీశారు.
కమీందర్ తన భార్య స్వప్న, కుమారుడు సూరజ్ మృతదేహాల వద్ద కూర్చుని ఉండటం చూసి స్థానికులు షాక్‌కు గురయ్యారు. పోలీసులకు స్థానికులు సమాచారం ఇవ్వగా పహడి షరిఫ్ సిఐ భాస్కర్‌రెడ్డి తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నాడు.
పోలీసుల విచారణలో తన భార్యను, కొడుకు సూరజ్‌ను శనివారం అర్థరాత్రి గొంతునులిమి హత్యచేసి అనంతరం కిరోసిన్ పోసి నిప్పు అంటించినట్టు కమీందర్ ఒప్పుకున్నట్లు పోలీసులు వివరించారు. స్థానికంగా తల్లీకొడుకుల దారుణహత్య తీవ్ర సంచలనం కలిగించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications