ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను చంపేశాడు
భీమవరం: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ఓ వ్యక్తి నిర్దయగా చంపేశాడు. ఆమె గర్భవతి అనే విషయం కూడా పట్టకుండా అతను ఆ దారుణానికి ఒడిగట్టాడు. ఆ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా కొమరాడలో జరిగింది. భీమవరం మండలం పెదరువుకు చెందిన మేడిది వినోద్ కుమార్, కొమరాడ గ్రామానికి చెందిన మరియమ్మను నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వారికి మూడేళ్ల కూతురు ఉంది. మరియమ్మ ప్రస్తుతం ఏడేళ్ల గర్భిణి.
తెలంగాణలోని హైదరాబాద్‌లో వినోద్ కుమార్ తాపీ పని చేసుకుంటున్నాడు. మరియమ్మ తండ్రి డేవిడ్ గతంలోనే మరణించగా, తల్లి ఆశీర్వాదం దుబాయ్‌లో ఉంటోంది. అయితే, పెళ్లి చేసుకున్న తర్వాత చిన్న చిన్న విషయాలకు కూడా వినోద్ కుమార్ భార్య మరియమ్మతో గొడవ పడుతూ ఉండేవాడు. అతనికి దూరంగా వచ్చేయాలని ఎన్నో సార్లు మరియమ్మకు సూచించారు. అయినా తన భర్తతోనే ఉంటానని చెబుతూ వచ్చింది.

ఈ స్థితిలో క్రిస్మస్ పండుగకు మంగళవారం ఉదయం కొమరాడలోని నానమ్మ ఇంటికి వినోద్ కుమార్ కుటుంబం వచ్చింది. రాత్రి వినోద్ కుమార్ భార్యతో గొడవ పడ్డాడు. ఆమెను ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. అడ్డువచ్చిన మరియమ్మ నానమ్మ, అమ్మమ్మలను తోసేశాడు. దీంతో వారు కేకలు వేయగా స్థానికులు వచ్చాడు. ఇంతలో భార్య గొంతు, పొట్టలను గట్టిగా నొక్కి వినోద్ కుమార్ భార్య మరియమ్మను హత్య చేశాడు.
దాంతో ఆగ్రహించిన స్థానికులు వినోద్ కుమార్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే అతను వారి నుంచి తప్పించుకుని పారిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వినోద్ కుమార్ కోసం గాలించారు. మరియమ్మ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వాస్పత్రికి పంపించారు.












Click it and Unblock the Notifications