వాడు మనిషే కాదు: భార్యతో మూత్రం తాగించాడు
వాడు మనిషి కాదు, పశువు కన్నా హీనం. భార్యను అతను పెట్టే హింస అత్యంత జుగుప్సాకరమైన స్థాయికి చేరుకుంది. ఆమెతో మూత్రం తాగించాడు.
గుంటూరు: వాడు మనిషిలా ప్రవర్తించలేదు, పశువుకన్నా హీనంగా వ్యవహరించాడు. భార్యను అతను పెట్టే హింస పతాక స్థాయికి చేరుకుంది. మద్యానికి బానిసైన భర్త అదనపు కట్నం తీసుకురావాలని భార్యను వేధించడం ప్రారంభించాడు. దాంతో ఆగకుండా తనపై ఇష్టం ఉంటే మూత్రం తాగాలంటూ భార్యను చిత్రహింసలకు గురి చేశాడు. చివరకు మూత్రం తాగించాడు.
అనంతరం ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించే యత్నం చేశాడు. దీనిపై బెల్లంకొండ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే ఎస్‌ఐ చర్యలు తీసుకోకపోవడంతో బాధితురాలు అర్బన్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె చేసిన ఫిర్యాదును బట్టి వివరాలు ఇలా ఉన్నాయి.

బెల్లంకొండ మండలం చిట్యాల తండాకు చెందిన యువతికి నగరంలోని లాలాపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఏటుకూరు రోడ్డు చాకలిగుంట ప్రాంతానికి చెందిన యువకుడితో 2007లో పెళ్లయింది. రూ. నాలుగు లక్షల కట్నం, మూడు సవర్ల బంగారు ఆభరణాలు ఇచ్చారు. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె పుట్టారు. పెళ్లి అయిన తర్వాత ఏడాది పాటు బాగానే చూసుకున్నాడు.
నిందితుడు కొంత కాలం క్రితం మద్యానికి బానిసై భార్యను వేధించడం ప్రారంభించాడు. చిట్యాల తండా పులిచింతల ముంపు గ్రామం కావడంతో పునరావాసం కింద ప్రభుత్వం బెల్లంకొండ వద్ద ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు మంజూరు చేసింది. అందులో రూ. రెండు లక్షలు ఇవ్వాలంటూ అతడు భార్యపై వేధింపులు పెంచాడు.
పోయిన దసరాకు ముందు భార్యను చిత్రహింసలకు గురి చేసి మూత్రం తాగించాడు. అయినప్పటికీ ఆమె పుట్టింటికి వెళ్ళకపోవడంతో ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశాడు. ఇరుగుపొరుగు వారు గమనించడంతో ఆ ప్రయత్నం మానుకున్నాడు. వారు తండ్రికి ఫోన్ చేయడంతో వచ్చి కూతుర్ని తమ వెంట తీసుకెళ్ళి బెల్లంకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అయితే అక్కడి పోలీసులు ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. కులపెద్దలు పంచాయితీ పెట్టినపుడు జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పిన భర్త తిరిగి వేధింపులు ప్రారంభించాడు. ఈ క్రమంలో తమకు న్యాయం చేయాలని బాధితురాలు తన తండ్రితో కలిసి అర్బన్ అదనపు ఎస్పీని ఆశ్రయించింది.












Click it and Unblock the Notifications