చిత్తూరులో దారుణం: ప్రియురాలిని చంపి ఇంట్లో పాతిపెట్టిన ప్రియుడు

అమరావతి: చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి చేసుకోమని ప్రియురాలు బలవంతం చేయడంతో ఆమెను ప్రియుడే అత్యంత దారుణంగా చంపేశాడు. వివరాల్లోకి వెళితే... చిత్తూరు జిల్లాలోని గుర్రంకొండ మండలం గంగిరెడ్డిగారిపల్లెకు చెందిన వేమనారాయణరెడ్డి (30) వాయల్పాడులో ఓ నెట్ సెంటర్ నిర్వహిస్తున్నాడు.

అదే మండలానికి చెందిన ముస్లిమ్ అయిన సబియా అనే యువతి ఎంబీయే అనంతరం నారాయణరెడ్డి నెట్ సెంటర్‌లో ఉద్యోగానికి కుదిరింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. నారాయణ రెడ్డితో ప్రేమలో పడిన తర్వాత సదేహ తన పేరుని సంధ్యగా మార్చుకుంది.

man murdered his girlfriend in chittoor

అనంతరం నారాయణరెడ్డి ఆమెకు తిరుపతిలోని విజయలక్ష్మి ఆటోమొబైల్స్‌లో ఉద్యోగం ఇప్పించాడు. ఈ క్రమంలో సంధ్య, నారాయణ రెడ్డిని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో అందుకు అంగీకరించిన అతడు ప్రియురాలిని చంపి ఓ గదిలో పూడ్చి పెట్టాడు.

రోజూ తల్లితో మాట్లాడే సబియా గత నెల 28 నుంచి కాల్ చేయడం మానేసింది. ఆరు రోజులైన తమ కూతురు ఇంటికి ఫోన్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన యువతి తల్లిదండ్రులు ఫిబ్రవరి 1న తిరుపతి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విద్యార్థిని కాల్ డేటా ఆధారంగా నారాయణ రెడ్డి అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయాన్ని బయటపెట్టాడు. సబియాను తానే హత్య చేసి గంగిరెడ్డిగారిపల్లెలోని తన ఇంట్లోనే పూడ్చిపెట్టినట్టు ఒప్పుకున్నాడు.

దీంతో స్థానిక ఎమ్మార్వో సాయంతో పోలీసులు శవాన్ని వెలికితీసే పనిలో పడ్డారు. తమ కుమార్తె పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు.

దీనిపై నిందితుడి స్నేహితులను విచారిస్తే వారిద్దరూ ప్రేమించుకున్న మాట నిజమేనని, యువతి పెళ్లి చేసుకోమని ఒత్తిడి తేవడంతో ఇంతటి దారుణానికి ఒడిగడతాడని తామంతా ఊహించలేకపోయామని వాపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+