సహజీవనం: ప్రేమజంటపై యువతి తండ్రి కత్తితో దాడి

తూర్పుగోదావరి: జిల్లాలోని కాకినాడలో సోమవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. సహజీవనం చేస్తున్నారని తట్టుకోలేక ఓ వ్యక్తి ప్రేమజంటపై కత్తితో దాడి చేశాడు. దాడిలో తీవ్ర గాయాలపాలైన యువకుడు మరణించగా, నిందితుడి కూతురు పరిస్థితి విషమంగా ఉంది.

ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కాకినాడకు చెందిన పెండ్యాల రవిశంకర్(38) విద్యుత్‌నగర్‌లో భార్య దేవితో కలిసి ఉంటున్నాడు. ఇతడు వైద్య ఆరోగ్య శాఖలో ఒప్పంద ఉద్యోగిగా పని చేస్తున్నాడు.

కాగా, రవిశంకర్.. పిఠాపురానికి చెందిన దుర్గా భవానీ అనే మరో మహిళతో పదేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. సోమవారం దుర్గా భవానీ తండ్రి నాగేశ్వరరావు పిఠాపురం నుంచి కూతురు ఇంటికి వచ్చాడు.

 A man murdered by his lover's father in East Godavari district

అదే సమయానికి ఇంటికి వచ్చిన రవిశంకర్‌పై నాగేశ్వరరావు కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు.
అడ్డువచ్చిన కుమార్తెపైనా కత్తితో దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.

గమనించిన స్థానికులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడు నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+