బావని చంపిన బావమరిది, పిల్లలు అనాథలు(పిక్చర్స్)

హైదరాబాద్: గృహిణి అనుమానాస్పద స్దితిలో మృతి చెందడంతో.. ఆమె మరణానికి కారణం బావేనంటూ, అతడిని బావమరిది హత్య చేసిన సంఘటన నగరంలోని ఎల్బీ నగర్‌లో సంచలనం సృష్టించింది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం..

నాగోలు జైపురికాలనీ సమీపంలోని అంధులకాలనీలో నివసించే సలీమా బేగం (38), బాబామియా (45) దంపతులు నివాసమంటున్నారు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. బాబామియా మలక్‌పేటలోని రేస్‌కోర్స్‌లో పనిచేస్తూ అప్పుడప్పుడూ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. దంపతులు ఇద్దరూ తరచూ గొడవలు పడుతుండేవారు. మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో అనుమానాస్పదస్థితిలో సలీమాబేగం మృతిచెందింది. ముగ్గురు పిల్లలు నిద్రలేచే సరికి బాబామియా తన తల్లికి ఫోన్‌లో సలీమాబేగం మృతి చెందిన విషయం చెప్పాడు.

సలీమాబేగం తల్లిదండ్రులు, తమ్ముళ్లు కూడా అదే బస్తీలోని మరో వీధిలో ఉంటున్నారు. సలీమాబేగం చనిపోయిన విషయం చెప్పమని పెద్ద కూతురు షబాను.. బాబామియా వారింటికి పంపించాడు. అక్కను బావేహత్య చేశాడన్న కోపంతో రగిలిపోతూ, కత్తితో ఇంటికి వచ్చిన సలీమాబేగం తమ్ముడు మహ్మద్‌ మున్నా, బాబామియాను కడుపులో పొడిచాడు. అనంతరం అతడి గొంతు కోశాడు. దీంతో బాబామియా అక్కడికక్కడే మృతిచెందాడు.

కోడలు సలీమా ఉరి వేసుకోని మృతి చెందిందన్న విషయం తెలుసుకు్న బాబామియా తల్లి జహీరాబీ మలక్ పేట నుంచి సంఘటనా స్దలానికి చేరుకుంది. ఈ లోపే కుమారుడు హత్యకు గురయ్యాడన్న వార్తివిని దిగ్బ్రాంతికి గురైంది. తల్లిదండ్రులు ఇద్దరూ మరణించడంతో వారి ముగ్గురు కుమార్తైలు అనాథలయ్యారు. బావను హత్యచేసిన మున్నా పరిస్దితిని తలచుకుని అతని భార్య ఇఖ్కత్, ముగ్గురు కుమారులు బావురుమంటున్నారు. మృతులకు చెందిన బంధువులు సంఘటనా స్దలానికి చేరుకోవడంతో పరిస్దితి ఉద్రిక్తంగా మారింది.

బావను చంపిన బావమరిది, అనాథలైన పిల్లలు

బావను చంపిన బావమరిది, అనాథలైన పిల్లలు

అక్కను బావేహత్య చేశాడన్న కోపంతో రగిలిపోతూ, కత్తితో ఇంటికి వచ్చిన సలీమాబేగం తమ్ముడు మహ్మద్‌ మున్నా.. వచ్చీ రావడంతో బాబామియాను కడుపులో పొడిచాడు. అనంతరం అతడి గొంతు కోశాడు. దీంతో బాబామియా అక్కడికక్కడే మృతిచెందాడు.

బావను చంపిన బావమరిది, అనాథలైన పిల్లలు

బావను చంపిన బావమరిది, అనాథలైన పిల్లలు

బాబామియా మలక్‌పేటలోని రేస్‌కోర్స్‌లో పనిచేస్తుంటాడు. అప్పుడప్పుడూ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో అనుమానాస్పదస్థితిలో సలీమాబేగం మృతిచెందింది.

 బావను చంపిన బావమరిది, అనాథలైన పిల్లలు

బావను చంపిన బావమరిది, అనాథలైన పిల్లలు

కోడలు సలీమా ఉరి వేసుకోని మృతి చెందిందన్న విషయం తెలుసుకు్న బాబామియా తల్లి జహీరాబీ మలక్ పేట నుంచి సంఘటనా స్దలానికి చేరుకుంది. ఈ లోపే కుమారుడు హత్యకు గురయ్యాడన్న వార్తివిని దిగ్బ్రాంతికి గురైంది. తల్లిదండ్రులు ఇద్దరూ మరణించడంతో వారి ముగ్గురు కుమార్తైలు అనాథలయ్యారు.

 బావను చంపిన బావమరిది, అనాథలైన పిల్లలు

బావను చంపిన బావమరిది, అనాథలైన పిల్లలు

దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో అనుమానాస్పదస్థితిలో సలీమాబేగం మృతిచెందింది. ముగ్గురు పిల్లలు నిద్రలేచే సరికి బాబామియా తన తల్లికి ఫోన్‌లో సలీమాబేగం మృతి చెందిన విషయం చెప్పాడు.

బాబామియానే తన కూతుర్ని చంపాడని మృతురాలి తల్లి ఫాతిమా పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాబామియా మద్యం తాగొచ్చి నిత్యం భార్యను వేధించేవాడని బంధువులు తెలిపారు. బంధువుల ఇళ్లకు కూడా వెళ్లనిచ్చేవాడు కాదని తెలిపారు. దంపతులిద్దరూ మృతి చెందటంతో వారి పిల్లలు అనాథలయ్యారు. ఎల్‌బీనగర్‌ ఏసీపీ సీతారాం, ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాబామియా తల్లి జైహిరాబీ ఫిర్యాదుతో మున్నాపై కేసు నమోదు చేశారు.

బాబామియాను హత్య చేసిన మున్నాని ఎల్‌బీనగర్‌ పోలీసులు అదుపులోకి ఉన్నట్లు సమాచారం. బాబామియాను హత్య చేసిన తరువాత మున్నా అక్కడే ఉన్నట్టు తెలిసింది. పోలీసులు అతని వద్ద కత్తిని స్వాధీనం చేసుకొని, అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. కానీ పోలీసులు ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించటం లేదు. మున్నా స్థానికంగా వెల్డింగ్‌ షాపు నిర్వహిస్తున్నాడని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+