భార్యని చంపి సంప్‌లో వేశాడు:అనుమానంతో మరోచోట..

గురువారం ఉదయం వెంకట్ రావు సరూర్ నగర్‌లో ఉంటున్న తన కూతురుకు ఫోన్ చేసి రప్పించాడు. లీలను హత్య చేసి, సంపులో పడేసినట్లు చెప్పాడు. హత్య చేసినట్లు కూతురుకు చెప్పిన తర్వాత తన ఫోన్‌ను స్విచ్చాఫ్ చేసి పెట్టాడు. అక్కడి నుండి పారిపోయాడు.
వెంకట్ రావు కూతురు.. బంధువులు, ఇతరులతో కలిసి వెళ్లి సంపులో చూడగా తల్లి శవం ఉంది. వెంకట్ రావు మంగళవారమే తన భార్యను హత్య చేశాడు. పోలీసులు ఇంటి తాళం పగులగొట్టి లోనికి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ రక్తపు మరకలు కనిపించాయి.
వెంకట్ రావు తరుచూ మద్యం సేవించి వచ్చి లీలను శారీరకంగా, మానసికంగా హింసించేవాడని చెబుతున్నారు. వీరి కొడుకు ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. సంఘటన జరిగిన రోజు తన సోదరి ఇంట్లోనే ఉన్నాడు. నిందితుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. కేసు నమోదు చేసుకున్నట్లు చెప్పారు.
భార్యపై అనుమాంతో...
భార్య పైన అనుమానంతో ఓ భర్త ఆమెను కడతేర్చాలనుకున్నాడు. ఆమె ఉస్సానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన రామకృష్ణ, మీనా దంపతులు ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చారు. ఐఎస్ సదన్ డివిజన్లో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. కూలీలుగా పని చేస్తున్న వారు మద్యం సేవిస్తుంటారు.
బుధవారం రాత్రి మద్యం మత్తులో ఇరువురు గొడవపడ్డారు. భార్య ప్రవర్తన పైన అనుమానంతో రోజులా భర్త ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాత్రి పదకొండు గంటల తర్వాత ఇంట్లో అందరు నిద్రిస్తున్న సమయంలో మీనా శరీరంపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications