ప్రియురాలి భర్తను చంపించిన ప్రియుడు: పది వేలు సుపారీ
విజయవాడ: విజయనగరం జిల్లాలో మైలాన్ ఉద్యోగి రాము అనుమానాస్పద మృతి కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. జిల్లాలోని ఎర్రచెరువులో రాము మృతదేహం పోలీసుకు దొరికింది. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపిన పోలీసులు కేసువిచారణ మొదలు పెట్టారు. అయితే ఈ కేసు కొత్తమలుపు తిరిగింది. అతడిని ఎవరో హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
మృతుడి భార్యను అదుపులోకి తీసుకొని విచారించగా శనివారం నిజానిజాలు బయటపడ్డాయి. మృతిడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకొన్న రమేష్‌ను ఈ హత్యలో ప్రధాన సూత్రధారిగా తేల్చారు. కొండలరావ్ అనే వ్యక్తికి రూ. 10000 సూఫారీ ఇచ్చి హత్యచేయించినట్లు విచారణలో బయటపడింది. నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.

పేలుడుతో బాలుడికి గాయాలు
కడప జిల్లా చాపాడు మండలం మడూరులో పాత ఇంట్లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 ఏళ్ల బాలుడికి తీవ్రంగా గాయలయ్యాయి. ఇదే జిల్లా రాజంపేటలో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఏడాదిన్నర పసిపాపను వదిలి వెళ్లిపోయారు. ప్రైవేట్ ఆస్పత్రి సిబ్బంది పాపను చేరదీశారు.
కరెంట్ షాక్‌తో ముగ్గురి మృతి
శ్రీకాకుళం జిల్లా జి. సిగడాం మండలం ఎస్‌పిఆర్ పురం గ్రామానికి చెందిన ఏలిసి దాలిరాజు (25), రమణ (25), సాయి (13) కరెంట్ షాక్‌కు గురై మరణించారు. సాయి గ్రామ సమీపంలోని పొలాల వైపు గొర్రెలు కాయడానికి వెళ్తూ మధ్యలో బంద చెరువులోకి దిగాడు. విద్యుత్తు తీగ తెగి చెరువులో పడి ఉండడంతో అతను విద్యుదాఘాతానికి గురై మరమించాడు. అతని సోదరుడు దాలిరాజు, మరో వ్యక్తి రమణ చెరువులో పడిపోయిన సాయిని చూసి బయటకు తీయబోయి మరణించారు.












Click it and Unblock the Notifications