తల్లిపై అత్యాచారం, అరెస్ట్: భార్య దూరం పెడుతోందని చంపేసిన భర్త
చిత్తూరు: తల్లి పైన అత్యాచారం చేసిన కేసులో తనయుడిని పోలీసులు అరెస్టు చేశారు. మదనపల్లి రెండో పట్టణంలోని విజయనగర్ కాలనీకి చెందిన 68 ఏళ్ల వృద్ధురాలి పైన ఈ నెల 5వ తేదీన రాత్రి అత్యాచారం జరిగింది. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఈ కేసులో ఆమె చిన్న కుమారుడు చలపతిని గురువారం హనుమాన్ జంక్షన్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. అత్యాచారం జరిగిన రోజు రాత్రి 9 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు నిందితుడు చలపతి ఇంట్లోనే ఉన్నట్లు విచారణలో తేలింది.
చలపతికి వివాహమై మొదటి భార్యను వదిలేశాడని, రెండో వివాహం చేసుకున్నప్పటికీ ఇతని చెడు అలవాట్లు భరించలేక ఆమె కూడా వదిలేసి వెళ్లిపోయిందని పోలీసులు చెప్పారు. చెడు వ్యవసనాలకు అలవాడుపడిన ఇతను కన్నతల్లి పైనే అత్యాచారం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అతనిని రిమాండుకు తరలించారు.

భర్త చేతిలో భార్య హతం
భర్త చేతిలో భార్య హతమైన సంఘటన చిత్తూరు నగర పరిధి సంతపేటలోని తంగవేల్ కాలనీలో గురువారం ఉదయం జరిగింది. వేలుమురుగన్ మేస్త్రీ పని చేస్తుంటాడు. అతని మొదటి భార్య అతని నుంచి విడిపోయింది. దీంతో కళావతి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు.
ఇటీవల భార్య పైన వేల్ మురుగున్‌కు అనుమానం కలుగుతోంది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. అంతేకాదు, తన భర్తను కళావతి కొద్ది రోజులుగా దూరం పెడుతోంది. దీంతో, ఆగ్రహానికి లోనైన వేల్ మురుగున్ గురువారం ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు.












Click it and Unblock the Notifications