ముగ్గురు గిరిజన బాలికలపై రేప్, పెద్ద బాలికపై పలుమార్లు
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో అన్నెం పున్నెం ఎరుగుని ముగ్గురు గిరిజన బాలికలు ఓ కామాంధుడి చెర పడ్డారు. యాబై ఏళ్లు దాటిన ఓ వ్యక్తి ముగ్గురు గిరిజన బాలికలపై అత్యాచారం చేశాడు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం దుర్బలమిట్ల గ్రామంలో గురువారం ఈ సంఘటన బయటకు వచ్చింది.
దుర్బలమిట్లకు చెందిన ఓ మహిళ సమీపంలోని ఫైవ్ స్టార్ ఆక్వా హేచరీలో పనిచేస్తోంది. ఆమె కూతుళ్లు ముగ్గురు (9,10,11 ఏళ్ల వయస్సు) ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. అదే గ్రామంలోని మిక్స్‌డ్ కాలనీలో ఉండే ఆంజనేయులు (52) అనే వ్యక్తి పాఠశాలకు వెళ్తూ అమ్మాయిలకు వస్తువులు కొనిస్తూ వారిని మచ్చిక చేసుకున్నాడు.

జననరి 29వ తేదీన ముగ్గురు బాలికలను కూడా తన ఇంటికి తీసుకుని వెళ్లి వారిపై అత్యాచారం చేశాడు. వీరిలో పెద్ద బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. పెద్ద కూతురు పడుతున్న బాధను చూసి తల్లి అడిగింది. జరిగిన విషయాన్ని పిల్లలు తల్లికి చెప్పారు. పిల్లల తల్లి కాలనీ పెద్దలకు విషయాన్ని వివరించి స్థానికుల సహాయంతో ఆంజనేయులు ఇంటికి వెళ్లింది. అప్పటికే అతను పారిపోయాడు.
విషయం తెలుసుకున్న రూరల్ డిఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి దుర్బలమిట్టలకు చేరుకుని వివరాలు సేకరించారు. అతడిపై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కింద కేసులు నమోదు చేశారు. ఈ సంఘటన స్థానిక తీవ్ర కలకలం సృష్టించింది.












Click it and Unblock the Notifications