సింటెక్స్ ట్యాంక్‌లో నగ్నంగా యువకుడి మృతదేహం (ఫోటోలు)
విశాఖపట్నం: నగరంలోని సింటెక్స్ వాటర్ ట్యాంక్‌లో ఉన్న యువకుడి మృతదేహం భూపేష్ నగర్‌లో కలకలం రేపింది. ఈ సంఘటన జరిగి మూడు రోజులు గడిచి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. హత్యా లేదా ఆత్మహత్యా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బౌడరా రోడ్డు ఎస్‌ఆర్‌ఎంటీ ఎదురుగా ఉన్న గణేష్ లాడ్జిని ఆనుకొని ఉన్న ఇంటి మేడ మీద వాటర్ ట్యాంక్‌లో మృతదేహాన్ని ఇంటి యజమాని గుర్తించారు. ఉదయం బాత్‌రూమ్‌లో ట్యాప్‌ల నుండి వస్తున్న నీటి నుంచి దుర్వాసన రావడం గమనించాడు.

దీంతో వాటర్ ట్యాంక్‌ను శుభ్రపరిచేందుకు ఇంటిపై మేడలో ఉన్న ట్యాంక్ వద్దకు చేరుకున్నాడు. ట్యాంకులో నీటిని తోడేందుకు లోనికి చూసే సరికే ఉబ్బి ఉన్న యువకుడి మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా హతాశులయ్యారు.
దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ట్యాంకు నుంచి పైకి తీసిన మృతదేహాన్ని స్ధానికులెవరూ గుర్తించలేకపోయారు. సంఘటన జరిగిన ఇంటి నుంచి పైకి వెళ్లేందుకు దారి లేదు. వాటర్ ట్యాంకు వద్దకు చేరాలంటే పక్కనే ఉన్న లాడ్జి లోపల నుండి మాత్రమే ఆ అవకాశం ఉంది.

దీంతో లాడ్జిలో దిగిన వారెవరైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అన్న అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేశారు. మృతదేహంపై ఎటువంటి దుస్తులు లేవు. ఎక్కడైనా చంపి ట్యాంకులో పడవేశారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లాడ్జిలో ఉన్న సీసీ కెమెరా పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.












Click it and Unblock the Notifications