16 ఏళ్ల బాలికపై కామాంధుడి అత్యాచారం
చిత్తూరు: మతిస్థిమితం లేని 16 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడిన సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం సిటిఎం మేజర్ పంచాయతీ నల్లగుట్టపల్లెలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. మదనపల్లె రూరల్ ఎస్‌ఐ రవిప్రకాష్‌రెడ్డి మురళి కథనం మేరకు- ఒంటరిగా ఉన్న మతిస్థితిమితం లేని బాలికను అదే గ్రామానికి చెందిన టైల్స్ పనులు చేసే సోమశేఖర్ మాయమాటలు చెప్పి పల్లె శివారులోని ఇటుకలబట్టీ వెనుకకు తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక తేరుకుని కేకలు వేయడంతో స్థానికులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
అప్పటికే సోమశేఖర్ పరారయ్యాడు. బాధితురాలిని కుటుంబ సభ్యులు, స్థానికులు మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలికపై కనే్నసిన సోమశేఖర్ శనివారం రాత్రి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు బాలిక బంధువులు మదనపల్లె రూరల్ ఎస్‌ఐ రవిప్రకాష్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడు సోమశేఖర్‌పై అత్యాచారం, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
తన భూమికి టైటిల్ డీడ్ కోసం గత మూడేళ్లుగా పోరాడుతున్న ఓ వృద్ధురాలు ఆదివారం మృతి చెం దింది. మరణించడానికి కొన్ని గంటల ముందు కూడా భూమి గురించే తీవ్ర ఆవేదన చెందిందని కుటుంబీకులు చెబుతున్నారు. పుంగనూరు మండలం బోడేవారిపల్లె పంచాయతీ అక్కింవారిపల్లెకు చెందిన ఎ.నారాయణ గ్రామసమీపంలో 35 సెంట్లు సెటిల్‌మెంట్ భూమిని కొనుగోలు చేసి సమాధుల కోసం ఆరు సెంట్లు ముస్లింలకు విరాళంగా ఇచ్చాడు.

నారాయణ ఐదేళ్ల క్రితం మృతి చెందడంతో ఆయన భార్య ఎ.వెంకటసుబ్బమ్మ(75) తన భర్తకు చెందిన 29 సెంట్ల కొనుగోలు భూమికి పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వాలని పలుమార్లు రెవెన్యూ అధికారులను కలవడంతో 2010లో వెంకటసుబ్బమ్మ పేరుతో పుంగనూరు తహసీల్దార్ పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చారు. దీనికి సంబంధించి భూమి యాజమాన్యపు హక్కుపత్రం (టైటిల్ డీడ్) ఇప్పించాలని గత మూడేళ్లుగా తహసీల్దార్, మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తమ భూమిపత్రాలు, చెల్లించిన శిస్తు రసీదులను చూపినా అధికారులు ఆమెపై దయ చూపలేదు.
29 సెంట్ల భూమి వెనుక ఉన్న ఓ వ్యక్తి వారి పొలంలోకి వెళ్లడానికి దారి లేకపోవడంతో పలుకుబడి ఉపయోగించి టైటిల్‌డీడ్ రానివ్వకుండా అడ్డుతగులుతూ వచ్చినట్లు మృతురాలి కుటుంబీకులు చెబుతున్నారు. ఎక్కడ తహసీల్దార్ కనిపించినా ఆమె తనకు న్యాయం చేయాలని వేడుకునేది. టైటిల్‌డీడ్ ఇవ్వరాదంటూ ఆ వ్యక్తి కోర్టులో స్టే తెచ్చుకున్నాడని, ఆ స్టే కూడా సబ్‌కలెక్టర్ కొట్టివేసినట్లు వారు తెలిపారు. ఆదివారం మృతి చెందే పది నిమిషాల ముందువరకు కూడా వెంకటసుబ్బమ్మ దీని విషయమై ఆవేదన వ్యక్తం చేసిందని కుటుంబసభ్యులు చెప్పారు.












Click it and Unblock the Notifications