లాడ్జిలో మహిళ స్నానం చేస్తుంటే వీడియో, అరవడంతో పరుగు
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో దారుణం వెలుగు చూసింది. మంత్రాలయంలోని ఓ లాడ్జిలో మహిళ స్నానం చేస్తుండగా ఓ దుండగుడు వీడియో తీశాడు. దుండగుడు వీడియో తీస్తుండటాన్ని గుర్తించిన మహిళ అరిచింది. దీంతో అతను అక్కడి నుండి పరారయ్యాడు. పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.
బావమరిదిని చంపిన బావ
కడప జిల్లా రాయచోటిలో ఓ బావ తన బావమరిదిని పొడిచి చంపాడు. ఎస్ వెంకటాపురంలో కరెంట్ షాక్‌తో భార్యాభర్తలు మృతి చెందారు. భార్యకు షాక్ కొట్టడంతో రక్షించేందుకు వెళ్లిన భర్త కూడా చనిపోయాడు. దీంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు.

ఎర్రచందనం పట్టివేత
కడప జిల్లా సిద్ధవటం గ్రామంలో నిల్వ ఉంచిన ఎర్రచందనంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాము స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ కోటి రూపాయలు చేస్తుందని పోలీసులు చెప్పారు. ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఎలుగుబంటిని చంపిన గ్రామస్థులు
శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి మండలం చింతలగార వీధుల్లోని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన ఎలుగుబంటిని గ్రామస్థులు కాల్చి చంపారు. గత కొన్ని రోజులుగా ఎలుగుబంటి గ్రామంలో సంచరిస్తూ గ్రామస్థులపై దాడికి పాల్పడింది. దీంతో గ్రామస్థులు గ్రామంలోకి వచ్చిన ఎలుగుబంటిని నాటు తుపాకీతో కాల్చి చంపారు.












Click it and Unblock the Notifications