నర్సీపట్నంలో భార్య చేసిన పనికి కుంగిపోయిన భర్త ఏం చేశాడంటే..
నర్సీపట్నంలో భార్య చేసిన పనికి భర్త బలయ్యాడు. మనసులో బాధ ఎవరికీ చెప్పుకోలేక కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరణానికి ముందు సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఈ సంఘటన జరిగింది. పట్టణంలోని కొత్తవీధికి చెందిన కామిరెడ్డి దుర్గాప్రసాద్‌కు వివాహమైన తర్వాత సంసారం సాఫీగా సాగిపోతోంది.
భార్య ఓ షాపింగ్ మాల్‌లో విధులు నిర్వహిస్తోంది. తన భార్యను వేరొక వ్యక్తి తీసుకువెళ్లాడని, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని వీడియలో తెలిపాడు. ఈ అవమానం భరించలేకే ప్రాణాలు వదిలేస్తున్నట్లు వెల్లడించాడు.

తన మరణానికి నవీన్‌తోపాటు నాగలక్ష్మి కారణమని, తన బావమరిది కూడా ఓ కారణమని దుర్గాప్రసాద్ తెలిపాడు. అతను పెద్ద నాటకాల రాయుడని వీడియోలో ఆరోపించాడు. చనిపోయి సాధించేదేమీ ఉండదని, బతికి సాధిద్దామనుకున్నానని, కానీ ఆవేదనతో ప్రాణాలు తీసుకుంటున్నట్లు వెల్లడించాడు.

నవీన్ అనే వ్యక్తి ఎంతోమంది మహిళల జీవితాలతో ఆడుకుంటున్నాడని, పోలీసుల చుట్టూ ఐదు నెలల నుంచి తిరుగుతున్నానని, ఇటువంటి వెధవల్ని వదిలేసి అమాయకులను అరెస్ట్ చేస్తారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన మరణానికి కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు.













Click it and Unblock the Notifications