కాపులను బీసీల్లో చేర్చాలంటూ కాకినాడలో వ్యక్తి ఆత్మహత్య, పవన్‌కు ప్రశ్న

కాకినాడ: కాపు ఐక్య గర్జన హింసాత్మక ఘటన మరుక ముందే కాకినాడలో మరో దారుణం చోటు చేసుకుంది. కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ కాకినాడ కలెక్టరేట్ ఆవరణలో సోమవారం మధ్యాహ్నాం ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మృతదేహాన్ని కిందకు దించగా అతడి జేబులో సూసైడ్ నోట్‌ను గుర్తించారు. కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్‌తోనే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు అందులో పేర్కొన్నాడు. కాపులు నేతలు, నాయకులు ఇప్పటికైనా మేల్కొనాలని, న్యాయం కావాలని అందులో పేర్కొన్నాడు.

man suicide attempt in kakinada collectorate

ప్రభుత్వం ఇప్పటికైనా మొద్ద నిద్రను వీడి కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేశాడు. అన్ని కులాల్లాగే కాపులకు రిజర్వేషన్ కల్పించాలని పేర్కొన్నాడు. కాపులను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని సూసైడ్ నోట్‌లో రాసి ఉంది. ఆత్మహ్య చేసుకున్న వ్యక్తిని చీకట్ల వెంకటరమణమూర్తిగా పోలీసులు గుర్తించారు.

అతడు కాకినాడలోని డైరీ ఫాంలో నివసించేవాడు. కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్‌తో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆదివారం తునిలో నిర్వహించిన కాపు ఐక్య గర్జన సభకు ఇతడు హాజరైనట్లు తెలుస్తోంది. సభకు హాజరైన కాకినాడకు చేరుకున్న సూరిబాబు ఈరోజు ఉదయం తీవ్రంగా ఆలోచించి మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడు.

పోలీసులు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు ప్రారంభించారు. చీకట్ల వెంకటరమణమూర్తి ఆత్మహత్య వెనుకు ఏమైనా శక్తులు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

పవన్ కళ్యాణ్‌కు ప్రశ్న...?

కాగా, ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి పేరు సూరిబాబు, రమణమూర్తి అంటూ వార్తలు వస్తున్నాయి. అతను పవన్ కళ్యాణ్‌ను కూడా సూసైడ్ నోట్లో ప్రశ్నించినట్లుగా వార్తలు వస్తున్నాయి. కాపులను బీసీల్లో చేర్చాలని, పవన్ కాపులకు ఏదో న్యాయం చేస్తారని ఎదురు చూశానని, చివరకు ఎదురు చూపులే మిగిలాయని, పవన్ తన పార్టీని ప్రశ్నించే పార్టీ అని చెప్పారని, కానీ ప్రశ్నల్లేని పార్టీగా మిగిలిందని పేర్కొన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+