‘‘నమ్మించి లోబరుచుకున్నాడు.. డబ్బులివ్వకపోతే ఫొటోలు నెట్‌లో పెడతానంటున్నాడు..’’

విశాఖపట్నం: తనను నమ్మించి మోసగించిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలంటూ జిల్లాలోని పాయకరావుపేట పట్టణానికి చెందిన గట్రెడ్డి సంతోషి స్థానిక పోలీసులకు విజ్ఞప్తి చేసింది. దీనిపై శుక్రవారం ఆమె విలేకరులకు వివరాలు వెల్లడించింది.

పాయకరావుపేటకు చెందిన పాటంశెట్టి రవితో తనకు వివాహం జరగ్గా మనస్పర్థల కారణంగా విడాకులకు దరఖాస్తు చేసుకున్నామని సంతోషి తెలిపింది. గుంటపల్లి గ్రామానికి చెందిన గట్టెం సురేష్‌ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబరుచుకున్నాడని ఆరోపించింది.

 Man threatening Woman that he will upload her Nude pics in Internet

తన నుంచి ఐదు తులాల బంగారం, 15 తులాల వెండి ఆభరణాలు, రూ.65 వేల నగదు కూడా తీసుకున్నాడని, తనతో కొంతకాలం అన్యోన్యంగా నటించాడని, తనకు కాకినాడలోని ఓ ప్రవేటు కళాశాలలో ఉద్యోగం రావడంతో అక్కడ కాపురం పెట్టామని చెప్పింది.

అప్పట్నుంచి తనను అనుమానిస్తూ రోజూ శారీరకంగా, మానసింగా వేధించేవాడని సంతోషి ఆరోపించింది. ఈ క్రమంలో తాము సన్నిహితంగా ఉన్నప్పుడు సురేష్‌ సెల్‌‌ఫోన్ ద్వారా తన నగ్న చిత్రాలను చిత్రీకరించాడని, రోజూ డబ్బులు ఇవ్వాలంటూ తనను బెదిరిస్తున్నాడని వాపోయింది.

దీంతో తాను తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయానని, అయినా సురేష్ వేధింపులు ఆపడం లేదని, అతడు అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తనకు సంబంధించిన వీడియోలను నెట్‌లో అప్‌లోడ్‌ చేస్తానని బెదిరిస్తున్నాడని, అతడి తల్లిదండ్రులు కూడా అతడి తరుపునే మాట్లడుతున్నారని సంతోషి ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ విషయమై తాను సురేష్, అతడి తల్లిదండ్రులపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పింది. ఇప్పటికైనా పోలీసులు స్పందించి సురేష్‌, అతడి తల్లిదండ్రులను శిక్షించాలని డిమాండ్ చేసింది.

అలాగే తన నుంచి సురేష్‌ తీసుకున్న ఆభరణాలు, గృహోపకరణాలు, నగదును తిరిగి తనకు ఇప్పించాలని ఆమె పోలీసులను కోరుతోంది. దీనిపై ఎస్‌ఐ వి.సత్యనారాయణను వివరణ కోరగా, గట్రెడ్డి సంతోషి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+