భార్యను కత్తితో పొడవబోయి తానే పొడుచుకున్న భర్త

గురువారంనాడు కూడా అదే రకంగా గొడవ పడ్డాడు. గొడవ సందర్భంగా కత్తి తీసుకుని భార్యను పొడవడానికి ప్రయత్నించాడు. పెనుగులాలో కత్తి అతని శరీరంలోకి దిగింది. దాంతో అతను మరణించాడు. అబ్దుల్ ఖయ్యూం తన భార్య అహ్మది బేగం, నలుగురు పిల్లలతో అరవింద్ నగర్‌లోని జిఆర్ రెసిడెన్సీలో నివసిస్తూ వస్తున్నాడు.
ఖయ్యూం ఇంతకు ముమదుద డ్రైవర్‌గా పనిచేసేవాడు. గత నెల రోజులుగా అతను పని మానేశాడు. దాంతో కుటుంబం పస్తులుండాల్సిన స్థితికి వచ్చింది. దీంతో భార్యాభర్తల మధ్య నిత్యం గొడవ జరుగుతూ వచ్చింది.
అహ్మది బేగంపై హత్య కింద కేసు నమోదు చేసినట్లు గోల్కొండ ఇన్‌స్పెక్టర్ మొహమ్మద్ మునావర్ చెప్పారు. గొడవ జరిగిన సమయంలో నలుగురు పిల్లలు కూడా పెద్ద పెట్టున ఏడుస్తూ బయటకు రావడంతో ఇరుగుపొరుగువారు అప్రమత్తమయ్యారు.












Click it and Unblock the Notifications