సిమి ఉగ్రవాదా?: కృష్ణాలో గన్‌తో వ్యక్తి, బెదిరిస్తూ చోరీ

విజయవాడ: తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ఓ వైపు సిమి ఉగ్రవాదుల కోసం ఐదు రాష్ట్రాల పోలీసులు వేట సాగిస్తుండగా.. కృష్ణా జిల్లాలో ఓ వ్యక్తి రివాల్వర్‌తో కలకలం సృష్టించిన సంఘటన వెలుగుచూసింది. అతను సిమి ఉగ్రవాది కావొచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.

నందిగామ మండలం హనుమంతపాలెంలో, ఓ వ్యక్తి తుపాకీని చూపించి ద్విచక్ర వాహనం పైన వెళ్తున్న వ్యక్తి నుండి బంగారం తీసుకున్నాడు. తాను బెదిరించి బంగారం తీసుకున్న విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని అతను బెదిరించాడని బాధితులు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. గొల్లపూడి వద్ద కారు లిఫ్ట్ అడిగాడు. హనుమంతపాలెం వద్ద ఆపి బెదిరించి దోచుకున్నాడు.

Man with gun halts people in Krishna district

భయాందోళనకు గురైన ఆ వ్యక్తులు నందిగామ డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తనను బెదిరించిన విషయాన్ని కూడా పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో కృష్ణా జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. అతను సిమి ఉగ్రవాదిగా అనుమానిస్తున్నారు. అతని కోసం గాలిస్తున్నారు. జగ్గయ్యపేట - నందిగామ హైవే, చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా సెర్చ్ చేస్తున్నారు.

దారి దోపిడీయే: నందిగామ డీఎస్పీ

నందిగామ వద్ద జరిగింది దాడి దోపిడీయేనని నందిగామ డీఎస్పీ సోమవారం మధ్యాహ్నం చెప్పారు. సిమి కార్యకర్తలు కాదని భావిస్తున్నట్లు చెప్పారు. దోపిడీకి పాల్పడిన వారి కోసం గాలిస్తున్నామన్నారు.

భయం గుప్పిట్లో అరవపల్లి

ఎన్‌కౌంటర్‌ తర్వాత అర్వపల్లి భయం గుప్పిట్లోనే ఉంది. ఎదురుకాల్పుల అనంతరం అర్వపల్లిని చుట్టిముట్టిన పోలీసులు ఇంకా మిగిలే ఉన్నారని భావిస్తున్న సిమీ కార్యకర్తల కోసం వేట ప్రారంభించారు. పెద్ద ఎత్తున కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు.

ఆదివారం మొదలైన కూంబింగ్‌ కొనసాగుతోంది. మరోవైపు జానకీపురం ఎన్‌కౌంటర్‌ ఘటనా స్థలంలో బాంబ్ స్క్వాడ్, ప్రత్యేక పోలీసు బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఉగ్రవాదుల వేట నేపథ్యంలో ఓ వైపు పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తుంటే మరోవైపు గ్రామంలో ఉగ్రవాదులు ఇంకా ఉన్నారన్న పుకార్లతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+