జగన్ ఓటమిపై మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్
మంచు లక్ష్మికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిర్మాతగా, నటిగా, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంటరామె. సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేస్తుంటారు. ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో మంచు లక్ష్మి తర్వాతే ఎవరైనా. దీనిపై ఆమె చాలానే విమర్శలు ఎదుర్కొన్నారు. అయినప్పటికి తన పంథాను ఏమాత్రం మార్చుకోకుండా ముందుకు సాగుతున్నారు. తాజాగా ఆమె ఏపీ రాజకీయాల గురించి స్పందించారు.
వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లను ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. డిప్యూడీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కల్యాణ్‌కు అభినందనలు తెలుపుతూ..'' రాజకీయాలు అనేది నాయకులకు ఒక ప్రత్యేక ప్రపంచం వంటిది. పవన్ కల్యాణ్ యాక్టర్‌గా ఉంటూనే చాలామంది నటీనటుల ప్రేమను పొందారు. వారి ప్రేమను పక్కకు పెట్టి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయనకు డబ్బు, ఫేమస్ అవసరం లేదు. ఎందుకంటే..ఆయన ఫేమ్‌నే అందరూ వాడుకుంటారు.

పాలిటిక్స్ అంటేనే మంచి చేసినా చెడు చేసినట్టు చూపిస్తారు. అయితే అవన్నీ నిలదొక్కుకుని పవన్ ఈ రోజు డిప్యూటీ సీఎం అయ్యారంటే అది చిన్న విషయం కాదు. ఆయన ఎక్కడా రాజకీయాలను వదిలేయలేదు. పట్టుదలతో అనుకున్నది సాధించి ఎంతోమందికి స్పూర్తిగా నిలిచాడు. ఆయనకు వచ్చిన విజయం నిజంగా ఎంతో స్పూర్తిదాయకం. ఇక ఇదే సమయంలో వైసీపీ అధినేత జగన్ గురించి కూడా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జగన్ కూడా ఫీల్ అవుతుండవచ్చు ఎన్ని పథకాలు ఇచ్చా అన్ని ఫ్రీగా ఇచ్చాను. అయినా నన్ను ఓడించారు అని. కానీ ఐదేళ్లకే ఆయనకు అలా అయింది. పదేళ్లు అయినా అలాగే అనుకోవచ్చు. ఎంత మంచి చేసిన విజయం రాలేదని ఆయన బాధపడుతుండొచ్చు కానీ వాళ్లంతా రాజకీయ నాయకులు. కాబట్టి కొద్ది కాలం అయ్యాక ఇవన్నీ కామన్ అనుకుంటారని మంచు లక్షి చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications