బెంగళూరు రేవ్ పార్టీపై స్పందించిన మంచు లక్ష్మి .. ఏమన్నారంటే!!

బెంగళూరు రేవ్ పార్టీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ రేవ్ పార్టీలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన, అలాగే బుల్లితెరకు చెందిన నటీనటులు పాల్గొన్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇక నటి హేమ వ్యవహారం అయితే మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ హల్చల్ చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే తాజాగా బెంగళూరు రేవ్ పార్టీ అంశంపై మంచు లక్ష్మి స్పందించారు.

మంచులక్ష్మి వెబ్ సీరీస్ యక్షిణి
హారర్ బ్యాక్ డ్రాప్ తో తెలుగులో మంచు లక్ష్మి నటించిన మరో క్రేజీ వెబ్ సిరీస్ రాబోతోంది. బాహుబలి సినిమాని నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాణంలో యక్షిణి వెబ్ సిరీస్ తెరకెక్కబోతుంది. మంచు లక్ష్మి, వేదిక, రాహుల్ విజయ్, అజయ్ ముఖ్య పాత్రల్లో ఈ సిరీస్ ని నిర్మించారు.

Manchu Lakshmi reacted on the Bangalore rave party

జూన్ 14 నుండి ఓటీటీలో
బాహుబలి నిర్మాతలు రూపొందిస్తున్న ఈ సోషియో ఫాంటసీ వెబ్ సిరీస్ పై ప్రేక్షకులకు కూడా భారీ అంచనాలు ఉన్నాయి. జూన్ 14వ తేదీ నుంచి హాట్ స్టార్ లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ, బెంగాలీ, మరాఠీ, హిందీ భాషలలో అందుబాటులోకి రానుంది. అయితే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొంటున్న మంచు లక్ష్మి తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆసక్తికర విషయాలు తెలిపింది.

ముంబైకి షిఫ్ట్ అవ్వటంపై స్పందించిన మంచు లక్ష్మి
ఇటీవల కాలంలో మంచు లక్ష్మి ముంబై కి షిఫ్ట్ అయ్యి అక్కడే ఉంటుంది. అయితే తాను ముంబైకి షిఫ్ట్ కావడం పైన మాట్లాడిన మంచు లక్ష్మి తాను అక్కడికి షిఫ్ట్ కావడంతో అందరూ బాలీవుడ్ కి వెళ్లానని భావించారని, అందులో ఎలాంటి నిజం లేదని తెలిపింది. అంతేకాదు హైదరాబాద్ నా ఇల్లు తో సమానం అని, నేను ఏ భాషలోనైనా నటిస్తానని వెల్లడించింది.

Manchu Lakshmi reacted on the Bangalore rave party

ముంబై వెళ్ళింది అందుకే
తాను హాలీవుడ్లో నటించిన తర్వాత టాలీవుడ్ లో, కోలీవుడ్ లో నటించానని, అందులో తప్పేమీ లేదని తెలిపింది. నా కూతురుతో పాటు నా భవిష్యత్తు కోసమే తాను అక్కడికి వెళ్లినట్టు మంచు లక్ష్మి చెప్పింది. మంచి అవకాశాలు వస్తే తెలుగులోనూ నటిస్తానని వెల్లడించింది.

బెంగళూరు రేవ్ పార్టీ పై స్పందించిన మంచు లక్ష్మి
ఇక ఇదే సమయంలో బెంగళూరు రేవ్ పార్టీ పై స్పందించిన మంచు లక్ష్మి అసలు ఆ పార్టీలో ఏం జరిగిందో తనకు తెలియదంటూ వ్యాఖ్యలు చేసింది. ఆ పార్టీకి వెళ్లిన వాళ్ళు ఎవరో కూడా తనకు తెలియదని ఆమె పేర్కొంది. పార్టీకి వెళ్లిన వాళ్లతో తనకు ఎటువంటి సంబంధం లేదని సమస్య ఆ పార్టీకి వెళ్లిన వ్యక్తులకు మాత్రమే అంటూ పేర్కొంది. దాంతో అందరికీ ఏం సంబంధం ఉంటుందని మంచు లక్ష్మి ప్రశ్నించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+