మోహన్ బాబు యూనివర్శిటీకి మంచు మనోజ్-భారీగా పోలీసులు..!

టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్ బాబు కుటుంబంలో చోటు చేసుకున్న వివాదాలు ఇంకా చల్లారలేదు. కుమారుడు మంచు మనోజ్ తో ఓవైపు వివాదం, పోలీసు కేసులు కొనసాగుతున్నాయి. మరోవైపు ఆయన కుమారుడు మంచు మనోజ్ ఇవాళ తన తండ్రికి చెందిన తిరుపతి మోహన్ బాబు యూనివర్శిటీకి వస్తున్నారు. భార్య మౌనికా రెడ్డితో కలిసి ఆయన వర్శిటీకి రానున్నారు. దీంతో అక్కడ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

Manchu manoj to visit ancestors graves in mohan babu university amid huge police deployments

సంక్రాంతి సందర్బంగా మోహన్ బాబు యూనివర్శిటీకి వెళ్లాలని నిర్ణయించిన మంచు మనోజ్.. ఇవాళ ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. హైదరాబాదు నుండి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న సినీ హీరో మంచు మనోజ్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో మోహన్ బాబు యూనివర్సిటీకి మనోజ్ దంపతులు బయలుదేరారు. మనోజ్ రాక సమాచారంతో మోహన్ బాబు యూనివర్శిటీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్శిటీకి చేరుకోనున్న మంచు మనోజ్-భూమా మౌనిక దంపతులు..వర్సిటీ ఆవరణలో ఉన్న తాత నారాయణస్వామి నాయుడు, నానమ్మ లక్ష్మమ్మల సమాధులకు పూజలు చేయనున్నారు. అనంతరం నారావారి పల్లెకు చేరుకుని మంత్రి నారా లోకేష్ తో వీరు భేటీ కానున్నారు. ఆ తర్వాత రంగంపేటలో జరగనున్న జల్లికట్టు పోటీలను వీక్షించనున్నారు. దీంతో మంచు మనోజ్ టూర్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అలర్ట్ అయ్యారు.

గతంలో హైదరాబాద్ లోని మోహన్ బాబు ఇంట్లోకి మీడియా ప్రతినిధులతో కలిసి వెళ్లేందుకు ప్రయత్నించిన మంచు మనోజ్ దంపతులకు ఇబ్బందులు తప్పలేదు. మోహన్ బాబు స్వయంగా బయటికి వచ్చి వారిని అడ్డుకోవడమే కాకుండా దీన్ని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై దాడికి దిగారు. దీంతో మోహన్ బాబుపై కేసు నమోదైంది. మరోవైపు తండ్రి మోహన్ బాబుతో వివాదం తర్వాత సైలెంట్ గా ఉంటున్న మనోజ్.. ఇవాళ తిరిగి రంగపేట రావడంతో టెన్షన్ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+