• search

పవన్‌పై మంచు మనోజ్, చిరంజీవి ఆసక్తికరంగా: ఇలా.. జనసేనాని ఓ సోషల్ సైంటిస్ట్

By Srinivas
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
   Megastar Wishes Actor Pawan Kalyan's On His Birthday

   అమరావతి/హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఆదివారం శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు గ్రీటింగ్స్ తెలిపారు. టాలీవుడ్ హీరో మంచు మనోజ్ జనసేనానికి విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు.

   మంచు మనోజ్ శుభాకాంక్షలు

   'పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాది పుట్టినరోజు మీకు చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే, వచ్చే ఏడాదికి మీరు రాజకీయనేత అవుతారు. బిగ్ బ్రదర్ వచ్చే ఎన్నికలలో మీకు శుభం జరగాలని కోరుకుంటున్నా. అద్భుత విజయాలతో పాటు మరింత శక్తి మీకు ఎల్లప్పుడూ ఉండాలి' అని ఆకాంక్షించారు.

   చిరంజీవి శుభాకాంక్షలు

   పవన్‌కు అన్నయ్య చిరంజీవి కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 'కల్యాణ్‌బాబు!! నువ్వు అందుబాటులో లేవని తెలిసింది. కలవాలని అనుకొని విరమించాను. పుట్టిన రోజు శుభాకాంక్షలు ఆ హనుమాన్‌, నీకు మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా. ఆశీస్సులతో అన్నయ్య చిరంజీవి' అని సందేశం పంపారు.

   కొణిదెల కంపెనీ వీడియో

   పవన్ పుట్టిన రోజు సందర్భంగా కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ ఓ ప్రత్యేకంగా రూపొందించిన వీడియోను అభిమానులతో పంచుకుంది. జనసేనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఉదయం నుంచి సోషల్ మీడియాలో సినీ ప్రముఖులతో పాటు, అభిమానుల నుంచి పెద్ద ఎత్తున సందేశాల వాన కురుస్తోంది.

   జనసేన శాస్త్రవేత్త వీడియో

   మరోవైపు, పవన్ పుట్టిన రోజు సందర్భంగా జనసేన పార్టీ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. సామాన్యుడి నుంచి సామాజిక శాస్త్రవేత్తగా పవన్ చేస్తున్న రాజకీయ ప్రయాణాన్ని వీడియోలో పొందుపర్చారు. జనసేనకు చెందిన శతాగ్ని టీమ్ ఈ వీడియోను రూపొందించింది. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలైనప్పటికీ ప్రజల జీవితాలకు మాత్రం స్వాతంత్ర్యం రాలేదని, అణగారిన, బడుగు, బలహీనవర్గాలు గాడాంధకారంలో కూరుకుపోయాయని, దశాబ్దాలుగా పాలకుల్లా ఉన్న రాజకీయ నాయకులు ప్రజాస్వామ్య వ్యవస్థను మంటగలిపి రాజకీయ విలువలను భూస్థాపితం చేశారని, సామాన్యుడి జీవితం అస్తవ్యస్తమైందని, ఇవన్నీ గమనిస్తున్న ఒకరి కడుపు మండిందని పవన్ గురించి సినీ, రాజకీయ ప్రస్థానాన్ని ఈ వీడియోలో చూపించారు. చివర్లో మార్పు కోసం.. సామాజిక శాస్త్రవేత్త పవన్ అంటూ ముగించారు.

   తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

   English summary
   Happy Birthday to powerstar PawanKalyan garu This year celebrations are quite special because by the next one you’ll be a political leader.. All the very best in the coming elections Big Brother:) Super success & more power to you always!

   Oneindia బ్రేకింగ్ న్యూస్
   రోజంతా తాజా వార్తలను పొందండి

   X
   We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more