మండలి ఏకగ్రీవం, చిరునవ్వుతో ఉండే మీరు: జగన్

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. నిబద్ధత, విలువలు కలిగిన నేత బుద్ధప్రసాద్ అన్నారు. మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు.
వైయస్ జగన్ మాట్లాడుతూ... ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు అన్నారు. ఎల్లప్పుడు చిరునవ్వుతో కనిపించే మీరు సభ్యుల హక్కులను కాపాడుతారని భావిస్తున్నానని చెప్పారు. మండలి సభ గౌరవం పెంచి సభ్యుల హక్కులు కాపాడుతారని భావిస్తున్నానని చెప్పారు.
కాగా, అంతకుముందు తెలుగుదేశం పార్టీ నేతలు, వైయస్ జగన్మోహన్ రెడ్డిల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. రైతులకు అనేక సమస్యలు ఉన్నాయని, రాష్ట్రం అభివృద్ధి చెందాల్సి ఉందని, వాటి గురించి మాట్లాడకుండా ఇతర అంశాల వైపు వెళ్లడం సరికాదని, గవర్నర్ ప్రసంగంలోని అంశాలకు పరిమితం అవుదామని జగన్ సూచించారు.












Click it and Unblock the Notifications