Mangalgiri Assembly Election 2024 Results LIVE: మంగళగిరి అసెంబ్లీ ఎన్నికలు 2024 లైవ్ అప్డేట్స్
మంగళగిరి అసెంబ్లీ ఎన్నికల 2024 ఫలితాలు ప్రత్యక్ష ప్రసారం: మంగళగిరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఎన్నికల ఫలితంపైన ఆసక్తి కనిపిస్తోంది. మంగళగిరి నుంచి 2019లో పోటీ చేసి ఓడిన లోకేష్ ఈ సారి గెలుపు కోసం తొలి నుంచి వ్యూహాత్మకంగా అడుగులు వేసారు. తాను ఓడిన చోటే గెలిచి అసెంబ్లీకి వస్తానని..మంగళగిరిలో గెలిచి తన తండ్రి చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇస్తానని గతంలో చెప్పారు. టీడీపీలో నెంబర్ టూగా ఉన్న నారా లోకేష్ మంగళగిరి నుంచి గెలుపు ఖాయమనే ధీమా పార్టీ నేతల్లో కనిపిస్తోంది. మరి..ఇది నిజమయ్యేనా..
ప్రతిష్ఠాత్మకపోరు
మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో 2019 లో లోకేష్ వైసీపీ అభ్యర్ది ఆర్కే చేతిలో ఓడిపోయారు. ఈ సారి మంగళగిరిలో జగన్ ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. బీసీ నియోజకవర్గంలో చేనేన వర్గానికి చెందిన గంజి చిరంజీవిని తొలుత అభ్యర్దిగా ప్రకటించారు. ఆ తరువాత మురుగుడు లావణ్యను ఖరారు చేసారు. హోరా హోరీగా ప్రచారం సాగింది. ముఖ్యమంత్రి జగన్ సైతం మంగళగిరిలో ప్రచార సభల్లో పాల్గొన్నారు.మంగళగిరి నుంచి నారా లోకేష్ గెలిచే అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసాయి. తాజాగా వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ లో ఆరా సంస్థ లోకేష్ గెలుపు ఖాయమని వెల్లడించింది.

గెలిచి గిఫ్ట్ గా ఇస్తాను
ఇక్కడ గెలుపు కోసం లోకేష్ సతీమణి బ్రాహ్మణి సైతం పలు మార్లు మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ తరపున ప్రచారం నిర్వహించారు. జనసేన, బీజేపీతో పొత్తు కూడా లోకేష్ కు కలిసి వచ్చింది. 2019లో ఓటమి నాటి నుంచి వ్యూహాలు అమలు చేసారు. అన్ని గ్రామాల్లోనూ సేవా కార్యక్రమాలు, వైద్య శిబిరాలు నిర్వహించారు. వైసీపీ తాము అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు గెలిపిస్తాయనే నమ్మకంతో ఉంది. మాజీ ఎమ్మెల్యే ఆర్కే వైసీపీ వీడి కాంగ్రెస్ లో చేరినా..తిరిగి ఎన్నికల సమయానికి వైసీపీలో రీ ఎంట్రీ ఇచ్చారు. లావణ్య గెలుపు కోసం పని చేసారు.
పార్టీ గెలుపు కోసం
2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు తరువాత నాటి చంద్రబాబు హాయంలో లోకేష్ మంత్రిగా పని చేసారు. అప్పుడు ఎమ్మెల్యేగా ఛాన్స్ లేకపోవటంతో ఎమ్మెల్సీగా వ్యవహరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పలు సందర్భాల్లో లోకేష్ ఓటమి పైన ఆ పార్టీ నేతలు వ్యాఖ్యలు చేసారు. ఎలాగైనా ఈ సారి గెలుపే లక్ష్యంగా పని చేసారు. తాజాగా వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ లో మంగళగిరి నుంచి లోకేష్ విజయం సాధిస్తారని ఆరా సంస్థ వెల్లడించింది.అయితే, వైసీపీ నేతలు మాత్రంమంగళగిరిలో గెలవబోతున్నామని ఇప్పటికీ చెబుతున్నారు. దీంతో..జూన్ 4న తుది ఫలితం ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications