వైసీపీ లీడర్స్ వన్స్ మోర్ డైలాగ్, తెలీదు, గుర్తులేదు, మరిచిపోయాం

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నాయకులు విచారణకు సహకరించడం లేదని, వీరి తీరుపై తాము సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తామని మంగళగిరి పోలీసు అధికారులు అంటున్నారు. ఏ ప్రశ్నలు అడిగినా వైసీపీ నాయకులు మాత్రం మాకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాం అంటూ సినిమా డైలాగులు చెబుతున్నారని మంగళగిరి పోలీసు అధికారి శ్రీనివాస్ రెడ్డి అంటున్నారు.

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నాయకులు దేవినేని అవినాష్, తలశిల రఘురామ్ సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ తీసుకున్నారు. పోలీస్ అధికారులు ఇప్పుడు విచారణకు పిలిచినా వెళ్లాలని, పోలీసుల దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలని, పోలీసులకు తెలీకుండా బయట ప్రాంతాలకు వెళ్లకూడదని సుప్రీంకోర్టు వైసీపీ నాయకులు దేవినేని అవినాష్, తలశిల రఘురామ్ కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Mangalagiri police officials said that the YCP leaders are not cooperating with the police investigation

అలాగే ఇద్దరూ పాస్ పోర్టులు మంగళగిరి పోలీసులు అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం విచారణకు రావాలని వైసీపీ నాయకులు దేవినేని అవినాష్, తలశిల రఘురామ్ కు మంగళగిరి పోలీసులు సూచించారు. మంగళవారం ఉదయం 10 గంటలకు వైసీపీ నాయకుడు తలశిల రఘురామ్ ను మంగళగిరి పోలీసులు ప్రశ్నించారు. వైసీపీ నాయకుడు తలశిల రఘురామ్ కు పోలీసులు ఏడు ప్రశ్నలు వేశారు.

ఈ ప్రశ్నలకి వైసీపీ నాయకుడు తలశిల రఘురామ్ తనకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను అని సమాధానం చెప్పారని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారి శ్రీనివాసరెడ్డి అన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మరో వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్ ను మంగళగిరి పోలీసులు ప్రశ్నించారు వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్ కు పోలీసులు 11 ప్రశ్నలకు వేశారు. పోలీసులు అడిగిన 11 ప్రశ్నలకు దేవినేని అవినాష్ తెలియదు, గుర్తులేదు మర్చిపోయాను అని సమాధానం చెప్పారని పోలీసు అధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Mangalagiri police officials said that the YCP leaders are not cooperating with the police investigation

దేవినేని అవినాష్, తలశిల రఘురామ్ ను వేర్వేరుగా విచారం చేసిన పోలీసు అధికారులు తర్వాత వారిని అక్కడి నుంచి పంపించేశారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరిగిన కేసులో వైసీపీ నాయకులు విచారణకు సహకరించడంలేదని మంగళగిరి సీఐ శ్రీనివాస రెడ్డి మీడియాకు చెప్పారు. మీ సెల్ ఫోన్లు ఇవ్వాలని తా కోరగా కోర్టు అనుమతి తీసుకు మొబైల్ ఫోన్లు ఇస్తామని దేవినేని అవినాష్, తలశిల రఘురామ్ చెప్పారని, మొబైల్ ఫోన్లు ఇవ్వకుండానే ఇద్దరూ వెళ్లిపోయారని పోలీసులు అన్నారు. ఇద్దరు నాయకుల గురించి తాము సుప్రీంకోర్టుకు సమాచారం ఇస్తామని మంగళగిరి పోలీసు అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+