ఇక తప్పుకో!: కనుమూరి బాపిరాజుకు షాక్, హెచ్చరిక
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవి నుంచి ఇక తప్పుకుంటే మేలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు మంగళవారం కనుమూరి బాపిరాజుకు సూచించారు. పదవి నుంచి తప్పుకోకుంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తగిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు.
యూపీఏ హయాంలో నామినేటెడ్ పదవులు పొందిన వారు ఇంకా పదవులు పట్టుకు వేళ్ళాడడం సమంజసం కాదని ఆయన హితవు పలికారు. మాణిక్యాల రావు మంత్రి ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

కనుమూరి బాపిరాజు నేతృత్వంలోని ధర్మకర్తల మండలి బాధ్యతల నుంచి వైదొలగాలని స్పష్టం చేశారు. శ్రీవారి దర్శనానికి విచ్చేసిన మంత్రి మాణిక్యాల రావుకు ఆలయ ఈవో గోపాల్, జేఈవో శ్రీనివాస రాజు ఘనంగా స్వాగతం పలికారు.
ఎంసీఐ నుంచి రాష్ట్రానికి 400 సీట్లు కేటాయింపు: మంత్రి కామినేని
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నుంచి రాష్ట్రానికి 400 సీట్లు కేటాయించారని ఆంధ్రప్రదేశ్ వైద్య విద్యాశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. నెల్లూరుకు 150, తిరుపతికి 50, కాకినాడకు 50 సీట్ల చొప్పున కేటాయించారని ఆయన తెలిపారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి 150 సీట్లను ఎంసీఐ కేటాయించిందని ఆయన చెప్పారు. వచ్చే నెల 5వ తేదీ నుంచి మెడికల్ కౌన్సిలింగ్ జరిగే అవకాశం ఉందని మంత్రి అన్నారు.
-
కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
తిరుమలలో చంద్రబాబు కుటుంబం- క్యూలైన్ ద్వారా దర్శనం, భక్తులతో కలిసి అన్నప్రసాదం -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications