వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిలో 25న రాహుల్, 26న ప్రధాని పర్యటన(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

నల్గొండ: ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏప్రిల్ 25న తెలంగాణలో పర్యటించనున్నారు. రాహుల్ గాంధీ మొదట వరంగల్ సభకు హాజరైన అనంతరం హైదరాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణ పిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, ఎంపి అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి దానం నాగేందర్‌లు రాహుల్ సభ జరిగే హైదరాబాద్‌లోని ఎల్‌బి స్టేడియాన్ని బుధవారం పరిశీలించారు.

కాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఏప్రిల్ 26న ప్రధాని మన్మోహన్ సింగ్ నల్గొండ జిల్లా భువనగిరిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని భువనగిరి ఎంపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం సభ జరగనున్న భువనగిరి మండలం మోతుకూరు రోడ్డులోని కోనూరు వద్ద సభాప్రాంగణాన్ని ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ సభకు దాదాపు 3లక్షల మంది హాజరవుతారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇచ్చిన మాటను ప్రధాని మన్మోహన్ సింగ్ అమలు పర్చారని తెలిపారు. ప్రధాని పాల్గొనే ఈ సభను విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజా ఏర్పాట్లను ఏఐసిసి సభ్యుడు గూడూరు నారాయణరెడ్డి పరిశీలిస్తారని రాజగోపాల్ రెడ్డి తెలిపారు.

ఇది ఇలా ఉండగా ఏప్రిల్ 27న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తెలంగాణలో పర్యటించనున్నారు. గురువారం ఉదయం ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సభల ఏర్పాట్లను దిగ్విజయ్ సింగ్ పర్యవేక్షించనున్నారు.

ఎల్‌బి స్టేడియం పరిశీలిస్తూ..

ఎల్‌బి స్టేడియం పరిశీలిస్తూ..

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బహిరంగ సభ ఏప్రిల్ 25న నిర్వహించనున్న నేపథ్యంలో ఎల్‌బి స్టేడియాన్ని పరిశీలిస్తున్న పొన్నాల లక్ష్మయ్య, దానం నాగేందర్, అంజన్ కుమార్ యాదవ్.

రాహుల్, సోనియా చిత్రాలతో..

రాహుల్, సోనియా చిత్రాలతో..

ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏప్రిల్ 25న తెలంగాణలో పర్యటించనున్నారు. రాహుల్ గాంధీ మొదట వరంగల్ సభకు హాజరైన అనంతరం హైదరాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి.

చేతికే మీ ఓటు

చేతికే మీ ఓటు

ఏప్రిల్ 25న రాహుల్ పర్యటన నేపథ్యంలో తెలంగాణ పిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, ఎంపి అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి దానం నాగేందర్‌లు రాహుల్ సభ జరిగే హైదరాబాద్‌లోని ఎల్‌బి స్టేడియాన్ని బుధవారం పరిశీలించారు.

పరిశీలించారు..

పరిశీలించారు..

ఏప్రిల్ 27న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తెలంగాణలో పర్యటించనున్నారు.

అంజన్, దానం సూచనలు..

అంజన్, దానం సూచనలు..

ఏప్రిల్ 25న హైదరాబాద్‌లోని ఎల్‌బినగర్‌లో రాహుల్ గాంధీ సభ నిర్వహించనున్న నేపథ్యంలో వేదికను పరిశీలించిన పొన్నాల లక్ష్మయ్య, అంజన్ కుమార్ యాదవ్, దానం నాగేందర్‌లు పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు.

English summary
Prime Minister Manmohan singh and Congress vice president Rahul Gandhi will campaign in Telangana on April 26th and 25th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X