ఏపీలో ఉచిత గ్యాస్ పథకం అమలు పై ప్రభుత్వం ప్రకటన..!!
ఏపీలో ఎన్నికల హామీల అమలు పైన చర్చ మొదలైంది. కొత్త ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. అమ్మకు వందనం పథకం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సూపర్ సిక్స్ లో భాగంగా ఇచ్చిన ఇతర హామీల అమలు పైన కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం పైన అసెంబ్లీలో మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టత ఇచ్చారు.
ఎన్నికల ముందు టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించింది. అధికారంలోకి వస్తే అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగా కుటుంబంలోని బడికి వెళ్లే ప్రతీ విద్యార్ధికి రూ 15 వేలు తల్లికి వందనం పేరుతో అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ పథకం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తల్లితండ్రులు, మేధావులతో చర్చించి విధి విధానాలను ఖరారు చేయనున్నారు. అదే విధంగా ప్రతీ మహిళకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం పైన హామీ ఇచ్చారు.

ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై మంత్రి నాదెండ్ల మనోహర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని అసెంబ్లీలో ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని ఆయన అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఈ పథకం అమలు చేయటం ద్వారా ఏడాదికి ప్రభుత్వంపై ఎన్ని వేల కోట్ల భారం పడుతుందనేది అధ్యయనం కొనసాగుతోంది. అదే విధంగా పథకం అమలు చేయాలంటే ప్రభుత్వం ద్వారా జరిగే లబ్ది నేరుగా గ్యాస్ కంపెనీలకే సిలిండర్ డబ్బులు చెల్లించాలా లేక..లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు వేయాలా అనేదానిపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications