వీడిన మిస్టరీ: కాళ్లను నరికి, తలను చెరువులో పడేశారు!

అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం మర్లగూడెం శివారులో యువకుడిని అతి కిరాతకంగా చంపిన హత్య కేసును పోలీసులు చేధించారు. యువకుడిని అతి దారుణంగా చంపడంతో పాటు శరీరం నుంచి తలను వేరు చేసి కాళ్లను నరికి గోతిలో పాతిపెట్టిన ఈ కేసుకు సంబంధించి ఆరుగురు నిందితులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.

కాళ్లను నరికి, తలను చెరువులో పడేశారు!: వివాహేతర సంబంధమేనా?

మృతుడు బుట్టాయిగూడెం మండలం పండుగూడానికి చెందిన సింగురాజుగా గుర్తించారు. అదివారం జంగారెడ్డి గూడెంలో సింగురాజు సైకిల్‌పై వెళ్తుండగా ఆటోకు అడ్డుగా వచ్చాడని అతడిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసినట్లు నిందితులు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది.

ఆటోకు అడ్డుగా వచ్చాడని ఆగ్రహించిన నిందితులు సింగురాజును కిడ్నాప్ చేసిన అనంతరం అతడిని బుట్టాయిగూడెం అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి చంపి మృతదేహాన్ని ముక్కలు ముక్కులుగా నరికి రెండున్నర అడుగుల గొయ్యి తవ్వి అందులో అతడిని పాతిపెట్టినట్లు పేర్కొన్నారు.

Mans head cut half in west godavari district

సింగరాజును అతి కిరాతకంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షిస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఈ సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకోగా, ఆదివారం ఉదయం అటవీ ప్రాంతంలో రామకృష్ణ అనే వ్యక్తి కాలకృత్యాలు తీర్చుకోడానికి వెళ్లగా కుక్కలు సింగరాజు మృతదేహానికి అంటిన రక్తాన్ని నాకడం గమించిన అనంతరం అటవీశాఖ ఉద్యోగికి సమాచారం అందించాడు.

దీంతో జంగారెడ్డి డీఎస్పీ ఆదేశాల మేరకు సీఐ శ్రీనివాస్‌యాదవ్‌, బుట్టాయగూడెం ఎస్‌ఐ రవికుమార్‌లను సంఘటనా స్థలానికి చేరుకుని సంఘటనా స్థలంలోని మట్టిని తొలగించగా తల లేకుండా మొండెంతో ఉన్న 30 ఏళ్ల యువకుడి మృతదేహం బయటపడిన సంగతి తెలిసిందే.

దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించిన నిందితులను రెండు రోజుల్లోనే అరెస్ట్ చేయడం గమనార్హం. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మంగళవారం కోర్టుకు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+