Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మాన్సాస్‌ ట్రస్ట్ రగడ : రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీకి మాన్సాస్ ఈవో షాకింగ్ లెటర్ ; అశోక్ గజపతి ఎఫెక్ట్ !!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాన్సాస్ ట్రస్ట్ వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతున్న విషయం తెలిసిందే. అశోక్ గజపతిరాజు వర్సెస్ వైసిపి ప్రభుత్వం అన్నట్టు సాగుతున్న ఈ వివాదంలో మాన్సాస్ ట్రస్ట్ ఈవో నలిగిపోతున్నారు. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా మాన్సాస్ ట్రస్ట్ వివాదం కొనసాగుతున్న క్రమంలో ఈ బాధ్యతలు నాకొద్దు మహా ప్రభో అంటూ ఆయన రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ కి మానస ట్రస్ట్ నుండి తనను తప్పించి, తిరిగి తనను రెవెన్యూ విభాగానికి పంపించాలని కోరినట్లుగా తెలుస్తోంది.

మాన్సాస్ ట్రస్ట్ రగడ ... అశోక్ గజపతి రాజు వర్సెస్ వైసీపీ ప్రభుత్వం

మాన్సాస్ ట్రస్ట్ రగడ ... అశోక్ గజపతి రాజు వర్సెస్ వైసీపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం ఆలయ ట్రస్ట్ చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతిరాజు ను తొలగించి ఆయన స్థానంలో ఆనంద గజపతిరాజు మొదటి భార్య కుమార్తె సంచైత గజపతిరాజును నియమించింది. న్యాయ పోరాటం చేసిన అశోక్ గజపతిరాజు, కోర్టు ఆదేశాలతో తిరిగి మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మాన్సాస్ ట్రస్ట్ వివాదం మరింత ముదిరిపోయింది. ట్రస్ట్ చైర్మన్ గా అశోక్ గజపతిరాజు తిరిగి బాధ్యతలు స్వీకరించినప్పటినుండి మాన్సాస్ ట్రస్టులో కొన్నేళ్లుగా ఆడిటింగ్ జరగలేదని, అవకతవకలకు పాల్పడ్డారని, మాన్సాస్ ట్రస్ట్ భూములు టిడిపి హయాంలో దొంగ జీవోలను జారీ చేసి అమ్ముకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి.

 ఉద్యోగుల జీతాల వివాదం .. అశోక్ గజపతికి ఈవోకు మధ్య రగడ, ఈవోపై కోర్టు ఆగ్రహం

ఉద్యోగుల జీతాల వివాదం .. అశోక్ గజపతికి ఈవోకు మధ్య రగడ, ఈవోపై కోర్టు ఆగ్రహం

ఇదే సమయంలో మాన్సాస్ ట్రస్ట్ లో ఉద్యోగుల జీతాల వ్యవహారం కూడా అశోక్ గజపతి రాజుకు, మాన్సాస్ ట్రస్ట్ ఈవోకు మధ్య వివాదానికి కారణమైంది. కోర్టుల దాకా ఈ వివాదం వెళ్ళింది. ఈవో వెంకటేశ్వరరావు ట్రస్ట్ ఉద్యోగులకు సహకరించటం లేదని, జీతాలు కూడా ఇవ్వటం లేదని అశోక్ గజపతిరాజు కోర్టును ఆశ్రయించారు. చైర్మన్ ఆదేశాలను ఈవో పాటించాల్సిందే అంటూ కోర్టు పేర్కొంది. అంతేకాదు ఈవో వ్యవహార శైలిపై కూడా కోర్టు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది. దీంతో అటు ప్రభుత్వానికి, ఈవోకు షాక్ తగిలింది . ఆ తర్వాత

ట్రస్ట్ సిబ్బంది జీతాలు చెల్లింపులో జాప్యానికి ఈవో నే కారణమంటూ అశోక్ గజపతిరాజు ఉద్యోగులను రెచ్చగొట్టారని అశోక్ గజపతిరాజు పై కేసు కూడా నమోదైంది . ఈవో పై భౌతిక దాడి చేయించేందుకు సిద్దమైనట్లు కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో మాన్సాస్ ట్రస్ట్ ఈవో అటు ప్రభుత్వ ఆదేశాలు , ఇటు చైర్మన్ ఒత్తిడి మధ్యలో నలిగిపోతున్నారని సమాచారం.

తనను తిరిగి రెవెన్యూకు బదిలీ చెయ్యాలని ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాసిన ఈవో

తనను తిరిగి రెవెన్యూకు బదిలీ చెయ్యాలని ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాసిన ఈవో

తాము చెప్పినట్టు నడుచుకోవాలని ట్రస్ట్ చైర్మన్ వర్గాలు, తమ ఆదేశాల మేరకు నడుచుకోవాలి అంటూ ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్న క్రమంలో ఈ బాధ్యతను నిర్వర్తించలేనని గత నెల 31 వ తేదీన రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ కి ట్రస్టు ఈవో వెంకటేశ్వరరావు లేఖ రాసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన వ్యక్తిగత కారణాలతో తనను మాన్సాస్ ట్రస్టు ఈవోగా బాధ్యతల నుండి తప్పించి, తిరిగి రెవెన్యూ విభాగానికి పంపించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

 ఈవో లేఖ దుమారం : వైసీపీ , టీడీపీ నేతల వెర్షన్ ఇదే

ఈవో లేఖ దుమారం : వైసీపీ , టీడీపీ నేతల వెర్షన్ ఇదే

అయితే వైసిపి వర్గాలు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు మాన్సాస్ అరెస్టుపై సర్వాధికారాలు కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని, ఈ క్రమంలోనే ఈవో ను వేధింపులకు గురి చేస్తున్నాడని, అందుకే ఈవో వెంకటేశ్వరరావు మాన్సాస్ ట్రస్ట్ ఈవోగా బాధ్యతలు నిర్వర్తించలేనని, తనను రెవెన్యూ శాఖకు బదిలీ చేయాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారని ఆరోపిస్తున్నారు. ఇక టిడిపి నేతలు ప్రభుత్వ ఒత్తిడిని, వైసిపి నాయకుల ఒత్తిడిని తట్టుకోలేకనే వెంకటేశ్వరరావు తనను బదిలీ చేయాలని రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాసి ఉంటారని చెప్తున్నారు. కారణమేదైనా మాన్సాస్ ట్రస్ట్ పై రాష్ట్ర రాజకీయాలలోకి రగడ కొనసాగుతున్న సమయంలో ఈవో తనను బదిలీ చేయాలని కోరడం ఆసక్తికర పరిణామం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+