టిలో అడుగుపెడితే జగన్ గతే: పవన్‌కళ్యాణ్‌కు హెచ్చరిక
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలంగాణలో అడుగు పెడితే మానుకోట పునరావృతం అవుతుందని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు మండిపడుతున్నారు. పవన్ త్వరలో తెలంగాణలో పర్యటిస్తారనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
దీనిపై వరంగల్ జిల్లాకు చెందిన కొందరు కాంగ్రెసు నేతలు ధ్వజమెత్తుతున్నారు. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పార్టీ సీమాంధ్ర కోసం స్థాపించాడని చెప్పారు. ఆయన మ్యానిఫెస్టో చూస్తే ఆ విషయం స్పష్టంగా తెలుస్తుందని వ్యాఖ్యానించారు.

తెలంగాణను కూడా ఉద్ధరిస్తానని ఇక్కడ పవన్ కళ్యాణ్ అడుగుపెడితే మానుకోటలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మానుకోటలో ఎలాంటి అనుభవం ఎదురయిందో అలాంటిదే మరోసారి జరుగుతుందని హెచ్చరించారు.
ఎన్నికల యుద్ధం: రఘువీరా
ఎన్నికల యుద్ధం ప్రారంభమైందని ఎపిసిసి అధ్యక్షులు రఘువీరా రెడ్డి గుంటూరు జిల్లాలో అన్నారు. పార్టీలోనే ఉండి కాంగ్రెసును బలహీనపరుస్తున్న వారు పెద్ద ద్రోహులన్నారు. ద్రోహులు కొందరు బయటకు వెళ్లినా కార్యకర్తలు కలత చెందాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెసులోకి కొత్త రక్తం వస్తోందన్నారు.
ఎపిని అభివృద్ధిలో ముందుకు తీసుకు వెళ్తామని చెరింజీవి అన్నారు. ఒక్కో జిల్లా ఒక్కో భాగ్యనగరంగా అభివృద్ధి చెందుతుందన్నారు. అధికారం అనుభవించి కొందరు స్వార్థపరులు పార్టీని విడిచి పెట్టారని మండిపడ్డారు. కాంగ్రెసు పార్టీలోనే సమన్యాయం జరుగుతుందన్నారు.












Click it and Unblock the Notifications