వైసిపికి భూమా బ్రహ్మానందరెడ్డి షాక్: జగన్ వచ్చేసరికి ఎమ్మెల్యేలు జంప్, అందుకే?

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: నంద్యాలలో భూమా బ్రహ్మానంద రెడ్డి, కాకినాడలో టిడిపి గెలుపు నేపథ్యంలో ఆ ప్రభావం వైసిపి అధినేత జగన్‌కు మరికొద్ది రోజుల్లో తెలియనుందని అంటున్నారు.

చిరంజీవి అలా చేశాక ఏం చేయాలో అర్థం కాలేదు: టిడిపిలో చేరిన శోభారాణి, నాడు ఇలా..

వైసిపికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు అధికార పార్టీతో లోలోపల చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఏ క్షణంలోనైనా పలువురు ఎమ్మెల్యేలు టిడిపిలో చేరవచ్చుననే ప్రచారం సాగుతోంది.

జగన్ లండన్ పర్యటనకు వెళ్లి వచ్చేసరికి..

జగన్ లండన్ పర్యటనకు వెళ్లి వచ్చేసరికి..

సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో వైసిపి ఓటమిపాలు కావడం ఆ పార్టీ నేతల్లోనే ఆందోళన కలిగిస్తోందని సమాచారం. జగన్ లండన్ పర్యటన నుంచి తిరిగి వచ్చే సమయానికి కొందరు ఎమ్మెల్యేలు టిడిపి వైపు మొగ్గినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.

టిడిపి నేతలతో టచ్‌లో

టిడిపి నేతలతో టచ్‌లో

వైసిపి ఎమ్మెల్యేలు, నేతలు తమతో మాట్లాడుతున్నారని టిడిపి వారు కూడా చెబుతుండటం గమనార్హం. ఇటీవలే శోభారాణి చేరిక సమయంలో మంత్రి నక్కా ఆనంద బాబు కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. వైసిపి ఎమ్మెల్యేలు తమతో తరచుగా మాట్లాడుతున్నారన్నారు.

ఇప్పుడే చెప్పం కానీ, చాలామంది టిడిపిలోకి

ఇప్పుడే చెప్పం కానీ, చాలామంది టిడిపిలోకి

నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాల తర్వాత వైసిపిలో కొనసాగేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇష్టపడటంలేదని, ఎంతో మంది టిడిపిలో చేరతామని వర్తమానం పంపుతున్నారని టిడిపి నేతలు చెబుతున్నారు. ఎంతో మంది టచ్‌లో ఉన్నారో ఇప్పుడే చెప్పబోమని, వచ్చే ఎన్నికల నాటికి మాత్రం వైసిపి చాలా వరకు ఖాళీ అవడం ఖాయమంటున్నారు.

మంచివారికి మాత్రమే ఛాన్స్, జగన్ వల్లే

మంచివారికి మాత్రమే ఛాన్స్, జగన్ వల్లే

టిడిపిలో చేరేందుకు వైసిపితో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఉవ్వీళ్లూరుతున్నారని టిడిపి నేతలు చెబుతున్నారు. తామే అందరినీ చేర్చుకోకుండా మంచివారికి మాత్రమే స్థానం కల్పిస్తామంటున్నారు. జగన్‌ ఒంటెద్దు పోకడల వల్ల వైసిపిలో కొనసాగేందుకు ఎవరూ ఇష్టపడటం లేదంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugu Desam Party leaders are hoping that many YSR Congress Party MLAs may join in Telugu Desam Party soon. After Nandyal and Kakinada victory TDP leaders are expecting joinings.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి