ఆర్థిక ఇబ్బంది.. భారంమీద వేసుకున్న జగన్, తెరపైకి ఆనం: టిడిపిలో హైడ్రామా

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల భారాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం భరించనున్నది. మొదట నుంచి ఖర్చు ఎవరు భరించాలన్న చర్చ సాగుతూ వచ్చింది.

విజయవాడ: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల భారాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం భరించనున్నది. మొదట నుంచి ఖర్చు ఎవరు భరించాలన్న చర్చ సాగుతూ వచ్చింది.

ఎట్టకేలకు అధినేత జగన్ సాయం అందిస్తామని ముందుకు వచ్చారు. దీంతో సోమవారం వైసిపి అభ్యర్థిగా ఆనం విజయ్ కుమార్ రెడ్డిని ప్రకటించారు. మరోవైపు టిడిపిలో పలువురు రేసులో ఉన్నారు.

టిడిపి అభ్యర్థి ఎంపికపై ప్రతిష్టంభన

టిడిపి అభ్యర్థి ఎంపికపై ప్రతిష్టంభన

తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంపికపై ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. ఆదివారం జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో అభ్యర్ధిని ఖరారు చేస్తారని ప్రచారం జరిగింది. కానీ అది సోమవారానికి వాయిదా పడింది. వాకాటి, ఆదాల మధ్యే నువ్వా నేనా? అన్నట్లుగా టిక్కెట్ కోసం పోటీ నెలకొంది.

బీద రవిచంద్రపై ఆగ్రహం

బీద రవిచంద్రపై ఆగ్రహం

ఇటు వైయస్సార్ కాంగ్రెస్, అటు టిడిపి పార్టీలు మంగళవారం నామినేషన్లు వేయడానికి సిద్ధమవుతున్నాయి. గతంలో పోటీ చేసే అభ్యర్థులను ముందుగానే ప్రకటించేవారు. ఈసారి జాప్యం కావడంతో ఇరుపార్టీల్లోనూ గందరగోళం నెలకొంది. కాగా, ఆదివారం రాజుపాళెంలో టిడిపి ముఖ్య నేతలతో చర్చ సందర్భంగా పెన్నా డెల్టా ఆకట్టుదారుల సంఘం అధ్యక్షుడు ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారికే పదవులు అంటూ జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర పైన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రసన్న కుమార్ రెడ్డి పార్టీని వీడినప్పుడు..

ప్రసన్న కుమార్ రెడ్డి పార్టీని వీడినప్పుడు..

కోవూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రసన్న కుమార్‌ రెడ్డి పార్టీని వీడితే ఆ మూడేళ్లు బాధ్యతలు మోశామని, కానీ పార్టీ అధిష్ఠానం ఆలోచన మేరకు ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్ధి గెలవాలని పోలంరెడ్డికి టిక్కెట్‌ ఇస్తే కష్టపడి పనిచేసి గెలిపించామని, ఇప్పుడు ఎమ్మెల్సీ పదవులొస్తే కాంగ్రెస్‌ నుంచి వచ్చినవారికే ఇస్తామని చెప్పడం ఏమిటని బీదా రవిచంద్రను ఉద్దేశించి ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నుంచి వచ్చిన వలసనేతలకే పదవులు, ముందు నుంచి పార్టీలో కష్టపడి పని చేస్తున్న కార్యకర్తలకు ఎప్పుడు గుర్తింపు ఇస్తారని నిలదీశారు.

వాకాటి వర్సెస్ ఆదాల

వాకాటి వర్సెస్ ఆదాల

మరోవైపు, సిట్టింగ్‌ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డిల మధ్య నువ్వా నేనా అన్నట్లు పోరు నడుస్తోంది. వారం రోజులుగా అదిగో ఇదిగో అంటూ అభ్యర్ధి ఖరారులో జాప్యం అవుతూ రావడంతో టీడీపీ నేతల్లో గందరగోళం నెలకొంది. వీటన్నింటికీ పుల్‌స్టాఫ్‌ పెడుతూ ఆదివారం జరిగిన పొలిట్‌ బ్యూరో సమావేశంలో అభ్యర్థి పేరు ప్రకటిస్తారని వెల్లడించారు. కానీ ఈ సమావేశంలో సీఎం చంద్రబాబుకే అభ్యర్థుల ఎంపిక బాధ్యత అప్పగిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించారు.

వైసిపి నుంచి తొలుత రామిరెడ్డి కానీ..

వైసిపి నుంచి తొలుత రామిరెడ్డి కానీ..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తరఫున తొలుత ఓ పారిశ్రామికవేత్త పేరు వినిపించింది. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి సదరు పారిశ్రామికవేత్తకు హామీ ఇచ్చారట. తీరా నోటీఫికేషన్ విడుదలయ్యే సమయానికి సదరు పారిశ్రామికవేత్త గురించి ఆరా తీస్తే రాజమండ్రికి చెందిన వ్యక్తిగా తేలింది. దీంతో స్థానికులకు అవకాశమిస్తే గెలుపు తథ్యమని వైసిపి నిర్ణయానికి వ్చచింది.

తెరపైకి ఆనం విజయ కుమార్ రెడ్డి

తెరపైకి ఆనం విజయ కుమార్ రెడ్డి

జిల్లాకు చెందిన వ్యక్తిని అభ్యర్థిగా పెడితే గెలుపు అవకాశాలు ఉంటాయని, పొరుగు జిల్లా వ్యక్తిని పోటీ పెడితే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైసిపి నేతలు మదనపడుతూ వచ్చారు. అదే సమయంలో సదరు పారిశ్రామికవేత్తకు కూడా డబ్బు సర్ధుబాటు కాకపోవడంతో వెనక్కి వెళ్లాడని, దీంతో వైసీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారంటున్నారు.

అనంతరం వైసిపి పలువురి పేర్లను పరిశీలించింది. చివరకు ఆనం విజయ్ కుమార్ రెడ్డి పేరును తెరపైకి తీసుకు వచ్చారు.

ఎన్నికల ఖర్చుపై..

ఎన్నికల ఖర్చుపై..

ప్రస్తుత జిల్లా రాజకీయాల్లో వైసీపీకి గట్టి అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డే అవుతారని అంతా భావించారు. రెండు రోజులక్రితం జిల్లా పార్టీ పరిశీలకుడు, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నెల్లూరుకు వచ్చి ముఖ్యనేతలతో చర్చించారు. ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించి అభ్యర్ధి అతనిని ఖరారు చేశారు. తాను ఎన్నికల ఖర్చు పూర్తిగా పెట్టలేనని ఆనం పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.

ఆర్థిక ఇబ్బందులను నో..

ఆర్థిక ఇబ్బందులను నో..

నెల్లూరు జిల్లాలో ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, జడ్పీ చైర్మన్ ఉన్నారని, వీరంతా ఆర్థికంగా సర్ధుబాటు చేయాల్సి ఉంటుందని వైవీ సుబ్బారెడ్డి చెప్పారని, దానికి వారు అంగీకరించ లేదని తెలుస్తోంది. తాము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని ఎన్నికల ఖర్చు తమపై మోపొద్దని చెప్పారని తెలుస్తోంది.

జగన్ గ్రీన్ సిగ్నల్

జగన్ గ్రీన్ సిగ్నల్

ఈ విషయాన్ని వైవీ సుబ్బారెడ్డి.. అధినేత జగన్ దృష్టికి తీసుకెళ్లారు. శనివారం రాత్రి జగన్ నుంచి ఖర్చు పైన ఆమోదం లభించడంతో.. సోమవారం ఆనం విజయ్ కుమార్ పేరును ప్రకటించారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+