ఏపీలో ఆ స్కూల్స్ లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి డ్యాన్స్.. ఎందుకంటే

విద్యార్థుల ప్రగతికి దోహదం చేయాలంటే వారికి ఎలా చెబితే వంటపడుతుంది అనేది గుర్తించవలసిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతంలోని పాఠశాల విద్యార్థులలో పురోగతి కోసం మనసు పెట్టిన మన్యం జిల్లా కలెక్టర్ వినూత్న కార్యక్రమాలతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని సైతం ఆకట్టుకుంటున్నారు.

మన్యం డాన్స్ పేరుతో మరో నూతన కార్యక్రమం
ఇప్పటికే ముస్తాబు కార్యక్రమం ద్వారా విద్యార్థులలో వ్యక్తిగత పరిశుభ్రత క్రమశిక్షణ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి అలవాటు చేయడానికి ప్రయత్నం చేసిన మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేలా నిర్ణయం తీసుకోవడానికి ప్రేరణని ఇచ్చారు. ఇక తాజాగా మరో వినూత్న కార్యక్రమంతో చిన్నారులలో సృజనాత్మకతను వెలికి తీయడానికి కృషి చేస్తున్న కలెక్టర్ మన్యం డాన్స్ పేరుతో మరో నూతన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Manyam Collector Prabhakar Reddy Launches Manyam Dance Program to Boost Children s Creativity amp amp Health

పిల్లలలో నైపుణ్యాల మెరుగుదలకు మన్యం డ్యాన్స్
పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య బలమైన అనుబంధాన్ని పెంచడానికి, పిల్లలలో సిగ్గు, భయం వంటి వాటిని దూరం చేయడానికి, వారిలో నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పాఠశాలల్లో ప్రతి శనివారం ఉదయం ప్రార్థన సమయం తర్వాత కొంతసేపు పిల్లల్లో ఈ మన్యం డాన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.ఇది పిల్లలలో రోజంతా ఉత్సాహాన్ని నింపుతుంది.

చిన్నారుల మానసిక, శారీరక ఆరోగ్యం కోసం మన్యం డ్యాన్స్
మానసికంగా, శారీరకంగా చిన్నారులు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఈ కార్యక్రమం వల్ల పాఠశాల వాతావరణం సంతోషకరంగా మారుతుంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, అధికారులు కూడా ఉత్సాహంగా పాల్గొంటూ విద్యార్థులతో మమేకమవుతారు. తాజాగా వీరఘట్టం మండలం తలవరం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన మన్యం డాన్సులో పాలకొండ సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ పాల్గొన్నారు.

మన్యం డ్యాన్స్ లో పాలకొండ సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్
ఆయన విద్యార్థులతో కలిసి ఉల్లాసంగా స్టెప్పులేస్తూ ఏరోబిక్స్ లాంటివి ప్రదర్శించారు. ఇలా అయిన మాత్రమే కాదు అధికారులందరూ విద్యార్థులలో సృజనను వెలికి తీయడంతో పాటు వారిలో శారీరక, మానసిక ఉల్లాసానికి మన్యం డాన్స్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమం కూడా విద్యార్థులను మంచి మార్పుకు దోహదం చేస్తుందని అధికారులు సైతం అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+