మావోల కలకలం: ఆరుగురు ప్రభుత్వోద్యోగుల కిడ్నాప్
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ఆరుగురు ప్రభుత్వ ఉద్యోగులను అపహరించిన మావోయిస్టులు మరోసారి కలకలం సృష్టించారు.
విశాఖపట్నం: ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ఆరుగురు ప్రభుత్వ ఉద్యోగులను అపహరించిన మావోయిస్టులు మరోసారి కలకలం సృష్టించారు. పనసపుట్టు ప్రాంతంలో వీరిని మావోయిస్టులు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం.

అపహరించిన వారిలో గ్రామీణ నీటిసరఫరా విభాగం జేఈ ఉన్నారు. జుడుంబో గ్రామ పంచాయతీకి అధికారులు బయలుదేరిన సమయంలో మార్గమధ్యలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ ఘటనతో ఆ ప్రాంతంలోని పోలీసులు, ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.












Click it and Unblock the Notifications