బాబుతోపాటు మరో సీఎంకు మావోల నుంచి ముప్పు: హోంశాఖ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మావోయిస్టుల నుంచి ముప్పు పొంచివుందని కేంద్ర హోంశాఖ శనివారం హెచ్చరించింది.
న్యూఢిల్లీ: మావోయిస్టుల కదలికలపై కేంద్ర హోంశాఖ నిఘా పెట్టింది. ఈ క్రమంలో పలు రాష్ట్రాలకు, నేతలకు హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మావోయిస్టుల నుంచి ముప్పు పొంచివుందని కేంద్ర హోంశాఖ శనివారం హెచ్చరించింది.
చంద్రబాబునాయుడుకు భద్రత మరింత పెంచాలని ఏపీ పోలీసు శాఖకు సూచించింది. ఈ మేరకు ఏపీ డీజీపీ కార్యాలయానికి లేఖ పంపినట్లు సమాచారం. కేంద్ర హోంశాఖ సూచనల నేపథ్యంలో ఏపీ పోలీసు శాఖ అప్రమత్తమైంది.

చంద్రబాబునాయుడుకు భద్రత పెంచేందుకు ఏపీ పోలీసు శాఖ సన్నద్ధమైంది. కాగా, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతోపాటు ఒడిశా ముఖ్యమంత్రికి కూడా మావోయిస్టుల నుంచి ముప్పు పొంచివుందని కేంద్రహోంశాఖ హెచ్చరించింది.
అంతేగా, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలకు కూడా మావోయిస్టుల నుంచి ముప్పు ఉందని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలో భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దులో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేతలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దాడికి ప్రతీకారంగానే మావోలు దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications