"మార్గదర్శి" పై చర్యలకు ప్రభుత్వం ఆదేశం - ఆట మొదలైంది...!!
మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థపైన చర్యలకు రంగం సిద్దమైంది. రాష్ట్రంలోని అనేక చిట్ ఫండ్ సంస్థల్లో ఏపీ ప్రభుత్వ స్టాంపులు..రిజిస్ట్రేషన్లు..డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటలిజెన్స్ టీంలు మూడు రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి.ఈ తనిఖీల్లో నిబంధనల ఉల్లంఘనలు నిర్దారణ అయ్యాయి. 1982 చిట్ ఫండ్ చట్టానికి విరుద్దంగా ఉన్న రికార్డులు, మెటీరియల్ ను అధికారులు సీజ్ చేసారు. చిట్ల రూపంలో కట్టిన నిధులను మళ్లించటం, జీఎస్టీ ఎగవేయటం, కంపెనీ పాడిన చిట్ లకు గ్యారెంటీ చూపకపోవటం వంటి ఉల్లంఘలను అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది.
అధికారుల చేతికి ఆధారాలు
తాజా తనిఖీల్లో వీటికి సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించారు. దీంత, ఈ ఆధారాలతో ఉల్లంఘనలపైన చర్యలు తీసుకోవాలని జిల్లాల చిట్స్ డిప్యూటీ రిజిస్టార్లను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ ఆదేశాలు జారీ చేసారు. ఇదే సమయంలో మార్గదర్శి సంస్థ తాజా తనిఖీల పైన ఒక ప్రకటన విడుదల చేసింది. తమ సంస్థ ఆరు దశాబ్దాల చరిత్రలో ఎక్కడా చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన చరిత్ర లేదని సంస్థ పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా 17 సంస్థల్లో అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారని వివరించింది. అదికారులు కోరిన సమాచారం సమకూరుస్తూ తమ సిబ్బంది సహకరిస్తున్నారని పేర్కొంది. అయినా ఏదో లోపాన్ని కనిపెట్టాలని ఉన్నతాధికారులు పదే పదే వారికి ఆదేశాలు ఇస్తున్నారని చెప్పుకొచ్చింది.

దాడిగా అభివర్ణించిన మార్గదర్శి
సివిల్ వ్యవహారాన్ని క్రిమినల్ కేసుగా మలిచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కుట్రపూరితంగా వ్యవహరించటం తమ సంస్థతో పాటుగా తమ ఖాతాదారుల పైన ప్రభుత్వ చేస్తున్న దాడిగా మార్గదర్శి సంస్థ పేర్కొంది. ఇక, ఇప్పుడు ఈ వివాదం రాజకీయ టర్న్ తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాటి ఎంపీ ఉండవల్లి ఫిర్యాదు మేరకు సోదాలు జరిగాయి. పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగింది. ఇప్పటికీ ఉండవల్లి మార్గదర్శి వ్యవహారం పైన న్యాయ పోరాటం కొనసాగిస్తున్నారు. ఇక, ఏపీలో ఎన్నికల దిశగా రాజకీయం వేడెక్కుతోంది. ముఖ్యమంత్రి జగన్ ప్రతీ సభలోనూ దుష్టచతుష్ఠయం అంటూ నలుగురి పైన ఫైర్ అవుతున్నారు. అందులో ఈనాడు పేరు ప్రస్తావిస్తున్నారు.
ఏపీలో కొత్త రాజకీయ మలుపు
ఆ గ్రూపులో ఒక సంస్థగా ఉన్న మార్గదర్శి పైన ఇప్పుడు ప్రభుత్వ అధికారులు సోదాలు చేయటం.. చర్యల దిశగా ఆదేశాలు జారీ చేయటంతో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటుందనే విషయం స్పష్టమవుతోంది. ఇప్పుడు మార్గదర్శి పైన చర్యలకు ఆదేశాలు జారీ కావటంతో..ఆ చర్యలు ఏ విధంగా ఉంటాయనేది ఉత్కంఠను పెంచుతున్నాయి. దీనికి సంబంధించి ఈ రోజు.. రేపు కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. మార్గదర్శి పైన ప్రభుత్వం చర్యలు ప్రారంభిస్తే టీడీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, జనసేన - బీజేపీ ఏ విధంగా వ్యవహరిస్తుందనేది కీలకంగా మారుతోంది.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications